AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: శనివారం మీ రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!

స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం.

Horoscope Today: శనివారం మీ రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!
Zodiac Sign
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 03, 2022 | 6:47 AM

మేషం.. మేషరాశి వారికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం.

వృషభం.. వృషభ రాశివారికి అనుకూల రోజుగా చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి.

మిథునం.. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం.. కర్కాటక రాశి వారికి అనుకూలమైన రోజుగా చెప్పాలి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి.

సింహం.. సింహ రాశి వారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.

క‌న్య.. కన్య రాశివారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది.

తుల‌.. తులరాశి వారు ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చికం.. వృశ్చిక రాశి వారు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు.

ధ‌నుస్సు.. ధనుస్సు రాశివారికి ఇది అనుకూలమైన సమయం. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు.

మకరం.. మకరరాశి వారికి బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.

కుంభం.. కుంభరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు.

మీనం.. మీనరాశి వారికి నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
తాలిబాన్లతో భారత అధికారుల భేటీ! పాక్‌కు దబిడి దిబిడే..!
తాలిబాన్లతో భారత అధికారుల భేటీ! పాక్‌కు దబిడి దిబిడే..!