Baba Vanga: కొత్త ఏడాదిపై బాబా వంగా భవిష్యవాణి.. ఏలియన్స్ ఎటాక్, సౌర సునామీ సహా అనేక ప్రళయాలు

బాబా వంగా అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలోని కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని అంచనా వేశారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని చెప్పారు.

Baba Vanga: కొత్త ఏడాదిపై బాబా వంగా భవిష్యవాణి.. ఏలియన్స్ ఎటాక్, సౌర సునామీ సహా అనేక ప్రళయాలు
Baba Vanga 2023 Predictions
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2022 | 12:33 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023లో అడుగు పెట్టబోతున్నాం.. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ఎలా ఉంటుంది, మనుషుల జీవితాలు ఎలా సాగుతాయని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 2023లో ఏం జరుగబోతుందో నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు.  5079 నాటికి భవిష్యత్తు వరకూ బాబా వంగా అంచనా వేశారని నమ్మకం. బాబా వంగా అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలోని కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని అంచనా వేశారు. భూమి కక్ష్యలో మార్పు ఉంటుందని దీంతో భూమిపై అనేక మార్పులకు జరుగుతాయని చెప్పారు. సౌర తుఫానుతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడనున్నాయని చెప్పారు. అధిక రేడియేషన్ స్థాయిలు ఏర్పడనున్నాయి. 2023 సంవత్సరంలో భూమిపైకి గ్రహాంతరవాసులు రానున్నారని..మనుషులతో శత్రుత్వం కలిగి ఉంటారని.. దీంతో  మిలియన్ల మంది మరణిస్తారని పేర్కొన్నారు.

  1. బాబా వంగా 2023 ఏడాదిపై అంచనాలు 2023లో సౌర తుఫాను లేదా సౌర సునామీ ఏర్పనుంది. దీని ఫలితంగా భూమి అయస్కాంత పొర తీవ్రంగా నాశనం అయ్యే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు.
  2. భూమిపై గ్రహాంతరవాసుల దాడి చేయనున్నారు. ఈ దాడిలో మిలియన్ల మంది మరణిస్తారు.
  3. 2023లో భూమి తన కక్ష్య ను మార్చుకుంటుందని చెప్పారు. భూమి కాస్మోస్‌లో అనిశ్చిత బ్యాలెన్స్‌లో ఉంది. దీంతో వాతావరణంలో భారీ మార్పుకు ఏర్పడవచ్చు. అప్పుడు పరిస్థితి నిజంగా ఆందోళనకరంగా ఉంటుంది.
  4. 2023 నాటికి మనుషులు ప్రయోగశాలల్లో పుడతారని బాబా వంగా అంచనా వేశారు. ల్యాబ్‌లో పుట్టే తమ పిల్లల రంగు, లక్షణాలను తల్లిదండ్రులే ఎంచుకోనున్నారు.  అంటే జనన ప్రక్రియ పూర్తిగా మానవ నియంత్రణలో ఉంటుందని అంచనా వేశారు.  వంగ ప్రకారం ప్రయోగశాల శిశువులు రేపటి పౌరులు అవుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించవచ్చు, దీంతో ఆసియా ఖండాన్ని విషపూరిత మేఘాలు చుట్టుముడతాయి. ఆసియా ఖండం మొత్తం పొగమంచుతో నిండిపోతుంది. ఈ మార్పు కారణంగా అనేక  దేశాలు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు.
  7. 2028లో ఒక వ్యోమగామి వీనస్‌పై దిగుతాడని బాబా వంగా అంచనా వేశారు. ఈ అడుగు 5079ని ప్రపంచం అంతం చేసే దిశగా పడుతుందని.. 5079 సంవత్సరం ప్రపంచం అంతం అవుతుందని బాబా వంగ గుర్తించారు.

తాము దైవం కొలిచే బాబా వెంగా చెప్పిన భవిష్యత్ వాణి తప్పకుండ జరుగుతుందని ఆమె శిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు. బాబా వెంగా 1996 లోనే చనిపోయారు. కంటి చూపు లేని ఆమె రానున్న భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్