Russian World: ప్రేమించి పెళ్ళికి నో చెప్పిన యువతి.. పురాతన సంప్రదాయం ప్రకారం అమ్మాయిని కిడ్నప్ చేసిన యువకుడు..

బాలిక కిడ్నాప్‌ను 'వధువు దొంగతనం' అని  రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా నచ్చిన అమ్మాయిని తీసుకుని పోవడం అనేది పురాతన సంప్రదాయం. రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉంది.

Russian World: ప్రేమించి పెళ్ళికి నో చెప్పిన యువతి.. పురాతన సంప్రదాయం ప్రకారం అమ్మాయిని కిడ్నప్ చేసిన యువకుడు..
Girl Kidnaped
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2022 | 8:57 PM

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి..జీవితాంతం తనకు నచ్చిన వ్యక్తితో బతకాలని ప్రతి యువతీయువకుడు కోరుకుంటారు. అయితే ప్రేమించిన వ్యక్తి తమని మోసం చేస్తే.. అప్పుడు చాలా బాధపడతారు.  ప్రేమించిన మోసపోయిన వ్యక్తుల బాధ  ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించిన వారికే అర్థం అవుతుంది. అయితే కొందరు తమని మోసం చేసినా అవతలి వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటే.. మరొకొందరు తమని మోసం చేసిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తాడు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పనులు సమాజం దృష్టిలో తప్పు. ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆ అమ్మాయిని ఆ ప్రేమికుడు కిడ్నప్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెట్టింట్లో అంతకంతకూ వైరల్ అవుతోంది.

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన రష్యాలో జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం..  బాలిక కిడ్నాప్‌ను ‘వధువు దొంగతనం’ అని  రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా నచ్చిన అమ్మాయిని తీసుకుని పోవడం అనేది పురాతన సంప్రదాయం. రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉంది. నివేదిక ప్రకారం.. 18 ఏళ్ల బేలా రావోయన్ ..  20 ఏళ్ల అమిక్ షామోయన్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే బేలా.. తాను ప్రేమించిన అమిక్ తో పెళ్లికి నిరాకరించింది. అయితే బేలా 18వ పుట్టినరోజు తర్వాత కిడ్నప్ చేయడానికి అమిక్ ప్లాన్ చేశాడు.

ఇవి కూడా చదవండి

కిడ్నాపర్లు బేలాను కిడ్నాప్ చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. బేలా కుటుంబం నడుపుతున్న కేఫ్‌లో  నిందితుడు తుపాకీని ఊపుతూ కనిపించాడు. అయితే ఈ సమయంలో ఎలాంటి కాల్పులు జరిగినట్లు వార్తలు వెల్లడలేదు. తన కూతురు కిడ్నప్ అయినట్లు బేలా తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ అమిక్ షామోయన్‌ను అరెస్టు చేసింది. అమిక్ తండ్రి, సోదరుడు ఏజెన్సీ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. నిందితుడిని రిమాండ్‌కి తీసుకుని విచారిస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం, బేలాను కిడ్నాప్ చేసి నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల తర్వాత కిడ్నాపర్ల నుంచి విముక్తి పొందిన బేలా పోలీసులకు సమాచారం అందించింది. అయితే అమ్మాయి తండ్రి బెళాకు మరొక సంపన్న కుటుంబంలోని యువకుడితో వివాహం చేయాలనుకున్నాడని.. అందుకనే ప్రియుడు కిడ్నప్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..