-
-
ఉత్తరఖాండ్ లోని ఔలి ప్రాంతంలో భారత్, అమెరికా సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలు జరుగుతున్నాయి. చైనా సరిహద్దులకు సమీపంలో ఇవి జరుగుతుండడంతో ప్రాధాన్యం నెలకొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా సైనిక శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా విన్యాసాలు చేస్తున్నారు.
-
-
సంయుక్త సైనిక విన్యాసాలతో రెండు దేశాల సైనికుల మధ్య మెరుగైన సాధన, వ్యూహాలు, టెక్నిక్ లు ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడనాకి అవకాశం ఏర్పడుతుంది. పతంగులతో శత్రు దేశాల డ్రోన్లను ట్రాప్ చేయడం, ఎత్తైన కొండ ప్రాంతాల్లో శత్రువుల కదలికలు కనుగొనడం వంటి విన్యాసాలను సైనికులు ప్రదర్శిస్తున్నారు. చూడొచ్చు. అలాగే ఈ విన్యాసాల్లో భాగంగా శునకాలను కూడా వినియోగిస్తున్నారు.
-
-
భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సంయుక్త ఆర్మీ డ్రిల్ జరుగుతున్నది.
-
-
శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు, నైపుణ్యాలను పెంచుకునేందుకు అమెరికా, భారత్ దేశాలు ఈ జాయింట్ మిలిటరీ విన్యాసాలను ప్రారంభించాయి. ఇది భారత్-చైనా పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
-
-
ఎత్తైన కొండల్లో యుద్దాలు చేయడంలో భారత సైన్యానికి విశేష అనుభవం ఉంది. దీంతో ఎత్తైన కొండల్లో యుద్ధం చేయడంపై అమెరికా సైన్యానికి భారత్ శిక్షణ ఇస్తుంది. తొలిసారిగా అ్యతంత ఎత్తైన కొండల్లో ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..