Funny Video: పిల్లల రక్షణ కోసం శక్తి మించి పోరాడేదే అమ్మ.. ఓ యువకుడిపై బాతు దాడి.. వీడియో వైరల్

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రెండు బాతులు తమ పిల్లలను వెంటపెట్టుకొని రోడ్డు దాటి అవతలివైపుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బాతు పిల్లలు రోడ్డు డివైడర్‌ ఎక్కలేక.. రోడ్డు చివరన ఉండిపోయాయి.

Funny Video: పిల్లల రక్షణ కోసం శక్తి మించి పోరాడేదే అమ్మ.. ఓ యువకుడిపై బాతు దాడి.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2022 | 7:17 PM

త‌ల్లి త‌న బిడ్డల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డల‌కు ఏదైఏనా ఆప‌ద రాబోతుంది అని తెలిస్తే తన పిల్లలను కాపాడుకోడానికి ఎంత దూర‌మైనా వెళుతుంది. తన శక్తికి మించి పిల్లలని రక్షించుకోవడం కోసం పోరాడుతుంది. ఇలా తల్లి ప్రేమని చూపించేది మనుషులు మాత్రమే కాదు.. పశువులు పక్షులు కూడా ఇందుకు అతీతం కావు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ప‌క్షి పిల్లల‌ను ఫోటోలు తీస్తూ ఆడుకోవడానికి ప్రయ‌త్నించిన ఓ వ్యక్తిని తల్లి ప‌క్షి త‌రిమికొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రెండు బాతులు తమ పిల్లలను వెంటపెట్టుకొని రోడ్డు దాటి అవతలివైపుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బాతు పిల్లలు రోడ్డు డివైడర్‌ ఎక్కలేక.. రోడ్డు చివరన ఉండిపోయాయి. రెండు బాతులు డివైడర్‌ ఎక్కి ఫుట్ పాత్ మీదకు చేరుకున్నాయి.  ఈ క్రమంలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసి అక్కడున్న ప‌క్షి పిల్లల‌ను డివైడర్‌ దాటించుదామనుకుని వచ్చి, ఆ క్యూట్‌ బర్డ్స్‌ని చూసి వాటితో కొద్దిసేపు ఆడుకుందామని ట్రైచేసాడు. అంతే అది గమనించిన పెద్ద పక్షులు రెండూ ఆ వ్యక్తిని తరిమి తరిమి కొట్టాయి. ఆ పక్షులు వెంట‌ప‌డ‌టంతో ఆ వ్యక్తి ప‌రుగుతీశాడు. ప‌క్షి పిల్లల వ‌ద్దకు వ్యక్తి రావ‌డాన్ని ప‌సిగ‌ట్టిన ప‌క్షి వెంట‌నే అప్రమ‌త్తమై పేవ్‌మెంట్ నుంచి దూకి అత‌డిని వెంబ‌డించాయి.

ఇవి కూడా చదవండి

ఈ మొత్తం సంఘటనను రికార్డు చేసిన ఓ మ‌హిళ ఆ వ్యక్తి నిస్సహాయ స్ధితికి నవ్వుకుందే తప్ప ఎలాంటి సాయం చేయలేకపోయింది. ఇతరుల పిల్లల జోలికి ఎన్నడూ వెళ్లకండి అంటూ కాప్షన్‌ జోడిస్తూ ట్విట్టర్లో షేర్ చేసారు. కాగా ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..