AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లి భోజనం చేసిన ఎంబీఏ స్టూడెంట్.. గిన్నెలు కడిగించిన వధూవరుల బంధువులు

ఓ యువకుడు తనను పిలవని పెళ్లి వేడుకక్కి వెళ్ళాడు. అక్కడ కడుపునిండా తిన్నాడు.. దీంతో ఆ యువకుడిని పట్టుకున్న వధూవరుల చుట్టాలు.. తిన్నదానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కించారు.. ఆ మొత్తానికి సరిపడా పనిచేయించారు.

Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లి భోజనం చేసిన ఎంబీఏ స్టూడెంట్.. గిన్నెలు కడిగించిన వధూవరుల బంధువులు
Mba Student Cleans Utensil
Surya Kala
|

Updated on: Dec 01, 2022 | 8:14 PM

Share

పెళ్లంటే సందడి.. ఆహుతులు, స్నేహితులు, బంధువులు పెళ్లింటికి వెళ్లి వధూవరులను దీవించి.. విందు భోజనం ఆరగించి సంతృప్తి చెందుతారు. అయితే వివాహ వేడుకలో విందు కోసం పిలవని పెళ్ళికి వెళ్లి.. సరదాగా ఎంజాయ్ చేయడమే కాదు.. తమకు నచ్చిన ఫుడ్ ను తిని హ్యాపీగా తిరిగి వచ్చేస్తారు. ఇటువంటి సన్నివేశాలను అనేక సినిమాల్లో చూస్తూనే ఉంటాం. ఇలా చేసిన సందర్భంలో చాలాసార్లు .. తప్పించుకున్నా.. కొన్ని సార్లు పట్టుబడతారు. కూడా.. అయితే కొందరిని గౌరవంగా వదిలేస్తారు. కానీ మరికొందరు.. ఇలా పిలవని పేరంటానికి వచ్చిన వ్యక్తులను అపహాస్యం చేస్తారు.. అయితే ఇప్పడు వైరల్ అవుతున్న వీడియోలో పిలవని పేరంటానికి వచ్చినట్లు.. తమ ఇంటిలోని పెళ్లికి వచ్చి.. కడుపునిండా తిన్న ఓ యువకుడిని చుట్టాలు పట్టుకున్నారు. అప్పుడు విధించిన శిక్ష తెలిస్తే షాక్ తింటారు. అంతేకాదు ఇలాంటి శిక్ష..  కడుపు నిండా హోటల్ లో తిని బిల్లు చెల్లించడానికి డబ్బులు లేవనే వ్యక్తులకు విధిస్తారు అని వెంటనే కామెంట్ చేస్తారు. ఈ సరదా సన్నివేశం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అవును, మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు… ఓ యువకుడు తనను పిలవని పెళ్లి వేడుకక్కి వెళ్ళాడు. అక్కడ కడుపునిండా తిన్నాడు.. దీంతో ఆ యువకుడిని పట్టుకున్న వధూవరుల చుట్టాలు.. తిన్నదానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కించారు.. ఆ మొత్తానికి సరిపడా పనిచేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. చూసిన వారు  ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎవరు ఈ సోదరుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో.. ఓ యువకుడు పాత్రలు కడుగుతున్నట్లు మీరు చూడవచ్చు.ఈ సమయంలో.. ఆ యువకుడు తాను పిలవకుండానే పెళ్లికి వెళ్లి భోజనం చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తాను జబల్పూర్ నివాసి అని ..భోపాల్ లో ఒక కాలేజీలో MBA చేస్తున్నానని చెప్పాడు.  ఉచితంగా ఇలా ఆహారాన్ని తిని.. తన తల్లిదండ్రులు డబ్బులు పంపొద్దు అంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియోను @AshwiniSahaya అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వేలల్లో వీక్షణలు, వందల సంఖ్యలో లైక్‌లను సొంతం చేసుకుంది ఈ వీడియో. పెళ్ళిలో ఎంతో ఆహారం వేస్ట్ అవుతుంది.. ఇలాంటి వ్యక్తులకు ఉచితంగా అందించండి.. అని ఒకరు.. మరొకరు.. వ్యాఖ్యానిస్తూ, ‘అరే, ఆ యువకుడు ఆహారం మాత్రమే తిన్నాడు.. ఈ విధంగా గిన్నెలు కడిగిన నేరం ఏమి చేసాడని ప్రశ్నించాడు. ప్రజలలో నుండి మానవత్వం పూర్తిగా అదృశ్యమైంది’ అని మరొకొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..