AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రీల్స్ కోసం మరీ ఇంత దిగజారుతవా..? కుక్కను తన్నిన యువతి.. మండిపడుతున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం చాలామంది లేనిపోని హడావుడి చేస్తుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలా చేస్తూ కొందరు ప్రమాదాల బారిన పడుతుంటే.. మరికొందరు నెటిజన్ల ఆగ్రహావేశానికి గురవుతున్నారు.

Watch Video: రీల్స్ కోసం మరీ ఇంత దిగజారుతవా..? కుక్కను తన్నిన యువతి.. మండిపడుతున్న నెటిజన్లు..
Kiran Kajal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2022 | 7:57 PM

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం చాలామంది లేనిపోని హడావుడి చేస్తుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలా చేస్తూ కొందరు ప్రమాదాల బారిన పడుతుంటే.. మరికొందరు నెటిజన్ల ఆగ్రహావేశానికి గురవుతున్నారు. ఇంకొందరు మానవత్వాన్ని మంటగలిపేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కాజల్ కిరణ్.. రీల్ కోసం కుక్కను తన్నింది. అ దీంతో నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు ఆమెపై నిప్పులు చెరుగుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులు ఆమె తీరుపై మండిపడుతుండటంతోపాటు.. అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.
కిరణ్ కాజల్ (Kiran Kajal) అనే ఇన్‌ష్టా యూజర్.. రీల్ కోసం ఓ కుక్కకు బిస్కెట్ పెడుతున్నట్లు కనిపించింది. బిస్కెట్ చూపించగానే ఆ కుక్క ఆమె దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చిన ఆ మూగజీవిని ఆమె కాలితో తన్నింది. దాంతో భయపడిన కుక్క అక్కడి నుంచి పారిపోయింది. ఏదో ఘనకార్యం సాధించినట్లు కాజల్ తెగ నవ్వుతూ కనిపించింది. కాగా, రీల్‌ని తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చెయ్యగానే.. నెటిజన్లు చూసి అమానవీయమంటూ ఆమెపై ఫైర్ అయ్యారు.
వీడియో చూడండి..

ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవర్లను కలిగి ఉన్న కాజల్‌పై.. జంతు ప్రేమికులు దుమ్మెత్తిపోశారు. సేవ్ ఎ స్ట్రే అనే ట్రస్ట్ వ్యవస్థాపకుడు విదిత్ శర్మ ట్వీట్ చేస్తూ.. ఇది అమానవీయమని.. జంతువులను ప్రేమించకపోయినా పర్వాలేదు.. బాధించకండి అంటూ ఫైర్ అయ్యారు. రిల్ కోసం ఇంతలా దిగజారిపోతారా..? ఇదేం పిచ్చి అంటూ మరికొందరు పేర్కొన్నారు.
వీడియో చూసిన నెటిజన్లు కాజల్‌పై తీవ్రంగా ట్రోల్స్ చేయడంతో.. దానిని డిలీట్ చేసింది. మరో వీడియోను పోస్ట్ చేసి క్షమాపణలు తెలిపింది. తనకు జంతువులూ, పక్షులంటే ఇష్టమనీ.. ఆ కుక్క తనపై దాడి చేస్తుందనే భయంతోనే కాలితో తన్నానంటూ పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..