Viral Video: నల్ల తాచుతో నాట్యం చేయించిన కోతి.. దాని అల్లరికి విసిగిపోయిన పాము ఏం చేసిందో చూస్తే..
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఒక్క క్షణం పాటు మనల్ని ఆగేలా చేస్తాయి.
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఒక్క క్షణం పాటు మనల్ని ఆగేలా చేస్తాయి. కొన్ని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగితే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని, భయాందోళనను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలో విపరీతంగా ఆకట్టుకుంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు, వింత పనులు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఇక కోతి చేసే అల్లరి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే.. మనుషులు ఎవరైనా అల్లరి చేస్తే ఎంట్రా ఆ కోతి పనులు అని చివాట్లు పెడుతుంటారు. అయితే, తాజాగా ఓ కొతి చేసిన ప్రమదాకరమైన అల్లరి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అవును మరి.. చిన్నా చితకా జంతువును ఆటపట్టించలేదు ఆ కోతి. ఏకంగా నల్లత్రాచుతో చెలగాటమాడింది. దానిని తెగ విసిగించింది. అటవీ ప్రాంతంలో 10 అడుగుల పొడవున్న ఓ నల్లత్రాచు వెళుతండగా.. కోతి గమనించింది. దాని వెంట పడింది. తన దారిన తాను వెళ్తున్న పామును.. ఆ కోతి అడ్డుకుంది. తోక పట్టుకుని ఆటాడుకుంది. భీకరంగా ఉన్న ఆ నల్లత్రాచు ఆగ్రహంతో బుసలు కొడుతున్నప్పటికీ ఆ కోతి ఏమాత్రం భయపడటం లేదు సరికదా.. ఇంకాస్త ఎక్కువగా విసిగించడం మొదలు పెట్టింది. పాము బుసలు కొడుతూ కాటు వేసేందుకు ప్రయత్నించినా భయపడకుండా.. తోకను పట్టుకుని వేధించింది. ఒక రకంగా చెప్పాలంటే పాముతో కాసేపు నాట్యం వేయించింది. ఇలా కాసేపు ఈ పోట్లాడుకుని, ఆ తరువాత తమ దారి తాము చూసుకున్నాయి కోతి, పాము.
కాగా, ఈ వీడియోను wild animal pix పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత ప్రమాదకరమైన పాముతో కోతి చెలగాటమాడటం చూసి ఆశ్చర్యపోయారు. ఓవైపు కామెడీగా ఉన్నా.. పాము కాటేస్తే ఆ కోతి ప్రాణాలు గాల్లో కలిసేవి అని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇదంతా వీడియో తీసిన వ్యక్తిపైనా నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..