Astro Tips: ఇంట్లో నెమలి పించం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..

గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడితో పాటు.. శ్రీ కృష్ణుడికి కూడా నెమలి పించం అంటే చాలా ఇష్టం. హిందూమత ఆచార సంప్రదాయాల్లో నెమలి పించానికి ప్రత్యేక స్థానం ఉంది.

Astro Tips: ఇంట్లో నెమలి పించం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
Peacock Feather
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2022 | 9:32 PM

గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడితో పాటు.. శ్రీ కృష్ణుడికి కూడా నెమలి పించం అంటే చాలా ఇష్టం. హిందూమత ఆచార సంప్రదాయాల్లో నెమలి పించానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లకు అత్యంతమై ప్రీతికరమైన ఈ నెమలి పంచాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా శుభం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇంట్లోని ప్రతికూల శక్తులు, దోషాలు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు. శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి పించాన్ని ధరించడం, కార్తికేయుడి వాహనం నెమలి కావడం.. లక్ష్మీ దేవి, సరస్వతి దేవీలకు ప్రతిరూపంగా భావించే ఈ నెమలి పించంతో అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు. సంపద, జ్ఞానం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. నెమలి పించానికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలు ఇవాళ మనం తెలుసుకుందాం..

డబ్బు కొరత తీరుతుంది..

చాలా కాలంగా డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇంట్లో నెమలి పించాన్ని ఉంచడం వలన ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్యం పండితులు. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచితే అక్కడ నెమలి పించాన్ని ఉంచడం వల్ల లక్ష్మీ మాత సంతోషించి తన దీవెనలు కురిపిస్తుంది. మీరు పని చేస్తున్న చోట నెమలి పించాన్ని పెట్టడం ద్వారా అంతా శుభం జరుగుతుంది.

జాతక దోషం తొలగిపోతుంది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో రాహుదోషం ఉందో, వారు తమ వద్ద నెమలి పించాన్ని ఉంచుకోవడం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది. నెమలి పించం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అదే సమయంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

చదువులో విజయం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పించాన్ని ఉంచడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పిల్లలు చదువుపై శ్రద్ధ వహించకపోతే.. వారి గదిలో నెమలి పించాన్ని ఉంచాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. ఇది వారి మనస్సును ఏకాగ్రతగా ఉంచుతుందని, చదువులో విజయాన్ని పొందుతారని చెబుతున్నారు.

నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది..

కొన్నిసార్లు మీ చుట్టూ ఏదో ప్రతికూల శక్తి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనికి అవాంతరాలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితిలో ఇంట్లో నెమలి పించాన్ని పెట్టండి. తద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి.. సానుకూల శక్తి వస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గణపతి విగ్రహం పక్కన ఎల్లప్పుడూ నెమలి పించాన్ని ఉంచాలి.

గమనిక: మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..