AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. నేటి నుంచి బ్రేక్ దర్శనం సమయాల్లో మార్పులు..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని..

Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. నేటి నుంచి బ్రేక్ దర్శనం సమయాల్లో మార్పులు..
Tirumala Srivari Temple
Amarnadh Daneti
|

Updated on: Dec 01, 2022 | 1:20 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ.సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది పిభ్రవరి 23వ తేదీన బాలాలయ పనులు ప్రారంభిస్తామన్నారు. 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు.. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో మార్పులు ఉండవని.. భక్తులు సమర్పించిన బంగారంతోనే తాపడం పనులు నిర్వహిస్తామన్నారు.. ఇక, జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని.. గత ఏడాది తరహాలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు. తిరుమలలో డిసెంబర్ 1 గురువారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

నందకం అతిధి గృహంలో 2.95 కోట్లతో ఆధునాతనమైన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డులో 9 కోట్ల రూపాయల వ్యయంతో క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తామని.. బాలాజీకాలనిలో 3 కోట్ల రూపాయల వ్యయంతో స్థానికుల నివాసాలకు మరమత్తులు నిర్వహిస్తామని.. రూ.3.8 కోట్ల వ్యయంతో పద్మావతి అతిథి గృహంలో గదులు మరమత్తులు చేపడతామన్నారు.. ఇక జమ్ములో ఆలయల నిర్మాణానికి 7 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి.

రూజ 3.3 కోట్ల రూపాయల వ్యయంతో స్వీమ్స్ హస్పిటల్‌లో హాస్టల్‌ గదులు నిర్మించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. . తిరుపతిలోని తాతాయ్యగుంట అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం రూ.3.7 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.. ఉద్యోగులుకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించామని.. కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జీతాలు పెంపుపై అధ్యయనం కోసం ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే