TSRTC: టీఆర్ఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. అటు విద్యార్థులకు, ఇటు పర్యాటకులకు డబుల్ బెనిఫిట్స్..

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు, వారి సౌకర్యార్థం అనేక ఆఫర్స్ ప్రకటిస్తోంది టీఆర్ఎస్ఆర్టీసీ. తాజాగా మరికొన్ని బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. అటు విద్యార్థులకు,

TSRTC: టీఆర్ఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. అటు విద్యార్థులకు, ఇటు పర్యాటకులకు డబుల్ బెనిఫిట్స్..
Tsrtc
Follow us

|

Updated on: Nov 27, 2022 | 8:07 AM

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు, వారి సౌకర్యార్థం అనేక ఆఫర్స్ ప్రకటిస్తోంది టీఆర్ఎస్ఆర్టీసీ. తాజాగా మరికొన్ని బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. అటు విద్యార్థులకు, ఇటు హైదరాబాద్ పర్యటనకు వచ్చే టూరిస్టులకు డబుల్ బెనిఫిట్స్ వర్తించేలా ఈ ఆఫర్స్ ప్రకటించింది. తాజగా ‘హైదరాబాద్ దర్శన్’ పేరిట అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా అతి తక్కువ ధరకే హైదరాబాద్‌ను చుట్టేయవచ్చు. 12 గంటల వ్యవధిలో నగరంలో ప్రముఖ సందర్శనా స్థలాలను చూసేయవచ్చు. బిర్లామందిర్, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బారాదారి, గోల్కొండ ఫోర్ట్, దుర్గం చెరువు పార్క్, కేబుల్ బ్రిడ్జి, ఎన్టీఆర్ గార్డెన్, హుస్సేన్ సాగర్‌లను ఈ ఆఫర్‌కింద చుట్టేయవచ్చు. అయితే, ఇందుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ. 250, పిల్లలకు రూ. 130, మెట్రో లగ్జరీలో అయితే రూ. 450, 340 చొప్పున చార్జీలు వసూలు చేస్తోంది ఆర్టీసి. ఇందుకు సంబంధించిన ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్ 040-23450033 కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.

గ్రేటర్ పాస్‌తో ఏ బస్సైనా ఎక్కొచ్చు..

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని విద్యార్థులకు టీఆర్ఎస్ ఆర్టీసీ నిజంగా పండుగ లాంటి వార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ బస్‌పాస్‌తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌గా నడిచే పల్లె వెలుగుు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది టీఎస్ఆర్టీసీ. సిటీ బస్సుల్లో విద్యార్థుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుదపాయాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరో స్వీట్ న్యూస్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ మరో స్వీట్ న్యూస్ కూడా చెప్పింది. మెట్రో కాంబినేషన్ టికెట్‌ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ TSRTC యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగిందని ప్రకటించింది. సిటీ బస్‌ పాస్‌ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్