Congress: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ ఖాళీ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న మునుగోడు ఎలక్షన్‌లో డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న మునుగోడు ఎలక్షన్‌లో డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు తాజాగా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ లీడర్లు గులాబీ కండువాలు కప్పుకొని మరో షాకిచ్చారు. రాజకీయంలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నట్టుగానే.. అవసరాన్ని బట్టి పార్టీలు మారుతూ ఉంటారు కార్యకర్తల నుంచి లీడర్ల వరకు. తాజాగా యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. మూలుగుతున్న నక్కమీద తాటికాయపడ్డట్టుగా.. అసలే మునుగోడు ఎలక్షన్‌లో డిపాజిట్ గల్లంతైన ఈ సమయంలో యాదగిరిగుట్ట కాంగ్రెస్ కౌన్సిలర్లు షాకిచ్చారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.
రాష్ట్ర అభివృద్ది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని.. అందుకే పార్టీమారినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు చెప్పారు. అయితే కొన్నిరోజుల కిందట మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ గులాబీ కండువాను పక్కన పెట్టి కాశాయం కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు ఎలక్షన్‌లో గెలవడం టీఆర్‌ఎస్‌కు పెద్ద సవాలుగా మారింది. కానీ ప్రజాక్షేత్రంలో ఓటర్లు కారుకే ఓటేసి గెలిపించారు. ఈ సమయంలో రెట్టించి ఉత్సాహంగా ఉన్న పార్టీలోకి.. కాంగ్రెస్ కౌన్సిలర్ల చేరికతో మరింత జోష్ కనిపిస్తుంది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది. సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేని పరిస్ధితి నెలకొంది.
అసలే తెలంగాణ రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయి పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎలక్షన్‌తో పెద్ద దెబ్బ తగిలినట్టైంది. ఇప్పటికే మనుగడ కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోమారు ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. ఈ ఎన్నికల ప్రభావంతోనే.. యాదగిరిగుట్ట కౌన్సిలర్లు గులాబీ పార్టీ కండువాలు కప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..