Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweat Smell: స్నానం చేసినా శరీరం నుంచి చెమట వాసన వస్తోందా? కారణాలివే.. జాగ్రత్తపడండి..

Sweat Smell: ఎండ, వేడికి చెమటలు పట్టడం సహజమే కానీ స్నానం చేసినా శరీరం నుంచి చెమట వాసన పోనప్పుడు ఏం చేయాలి? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది.

Sweat Smell: స్నానం చేసినా శరీరం నుంచి చెమట వాసన వస్తోందా? కారణాలివే.. జాగ్రత్తపడండి..
Sweat Smell
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 27, 2022 | 1:18 PM

ఎండ, వేడికి చెమటలు పట్టడం సహజమే కానీ స్నానం చేసినా శరీరం నుంచి చెమట వాసన పోనప్పుడు ఏం చేయాలి? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. అయితే, దానికంటే ముందు ఇందుకు గల కారణాలు తెలుసుకోవాలి. సాధారణంగా అయితే సబ్బుతో స్నానం చేసినా, పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నా చెమట వాసన తొలగిపోతుంది. కానీ, కొంతమందికి స్నానం చేసిన తరువాత కూడా చెమట వాసన పోదు. చెమట వాసన ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, చెమట వాసన ఎందుకు పోదు అని ఎప్పుడైనా ఆలోచించారా? చర్మంపై బ్యాక్టీరియా, చెమట కలయిక వల్ల ఈ దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే కాదు.. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హార్మోన్లలో మార్పులు..

హార్మోన్ల మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల విపరీతమైన చెమట, శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. గర్భధారణ సమయంలో, ప్రీమెనోపాజ్ లేదా మెనోపాజ్, పెరిగిన హార్మోన్లు, చెమట గ్రంథి కార్యకలాపాలు చెమట దుర్వాసనకు కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మహిళలకు విపరీతమైన చెమటలు, చెమట వాసన వస్తుంది.

వ్యాధుల కారణంగా..

ఏదైనా వ్యాధి కారణంగా విపరీతమైన చెమట వస్తుంది. తద్వారా శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది. మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, మూత్రపిండాల వ్యాధి, ఇన్ఫెక్షన్, గౌట్ వంటి కొన్ని కారణాల వల్ల కూడా చెమటలు పడుతుంటాయి. అయితే, శరీరం నుంచి వెలువడే వాసనలో ఆకస్మిక మార్పు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

స్పైసీ ఫుడ్ తీసుకోవడం వలన..

స్పైసీ ఫుడ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్, కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా చెమట దుర్వాసన వస్తుంది. శరీరంలో ప్రొటీన్లు పెరగడం వల్ల దుర్వాసన కూడా పెరుగుతుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన..

ఎక్కువ ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా చెమట ఎక్కువ వాసన వస్తుంది. చెమట వాసన ఎక్కువగా ఉంటే శరీరం ఒత్తిడికి లోనవుతుందని అర్థం. శరీరంలో చెమటలు పట్టడం సహజమే, అయితే ఎక్కువ చెమట పట్టడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. విపరీతమైన చెమట, దుర్వాసన ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..