Car Mileage: మీ కారు ‘మైలేజీ’ని పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే, ఈ టిప్స్ పక్కా ఫాలో అవ్వండి..

మన దేశంలో ప్రజలు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా దాని మైలేజీకి సంబంధించిన వివరాలనే ఆరా తీస్తారు. మైలేజీ మంచిగా ఉంటే..

Car Mileage: మీ కారు ‘మైలేజీ’ని పెంచుకోవాలని భావిస్తున్నారా? అయితే, ఈ టిప్స్ పక్కా ఫాలో అవ్వండి..
Car Mileage
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2022 | 9:25 PM

మన దేశంలో ప్రజలు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా దాని మైలేజీకి సంబంధించిన వివరాలనే ఆరా తీస్తారు. మైలేజీ మంచిగా ఉంటే.. ఆ బండిని కొనుగోలు చేస్తారు. లేదంటే అటు ఇటూ ఊగిసలాడుతూ.. సంశయిస్తారు. అది కారు అయినా, బైక్ అయినా మైలేజీ ఎంతో తెలుసుకున్న తరువాతే కొనుగోలు చేస్తారు. ఇక ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే.. ఖచ్చితంగా మైలేజీ ఇచ్చే బండ్లపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే, ఇవాళ మనం కారు మైలేజీ గురించి తెలుసుకుందాం. జనరల్‌గానే కారు కండీషన్ బాగుంటే.. మైలేజీ కూడా బాగుంటుంది. అదే సమయంలో కారు చెడిపోయినట్లయితే.. మైలేజీ కూడా తగ్గుతుంది. నిర్వహణ కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక విషయాలను మీకు చెప్పబోతున్నాం. కారు మంచి మైలేజీ ఇవ్వడానికి, డబ్బు ఆదా చేసుకోవడానికి ఉపయుక్తమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. కారు మైలేజీ.. డ్రైవింగ్ చేసే విధానంపైన కూడా ఆధారపడి ఉంటుంది. కారు రకంతో సంబంధం లేకుండా, ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలు మైలేజీ పరంగా చాలా ఉపయోగపడుతాయి. ఇది కారు పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా.. డబ్బును కూడా ఆదా చేస్తుంది. కారు మైలేజీని పెంచడానికి ఉపయోగపడే 10 చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

కారు మైలేజీని పెంచే 10 చిట్కాలు.. 1. టైర్ ప్రెజర్: కారు మైలేజీపై టైర్ ప్రెజర్ చాలా ప్రభావం చూపుతుంది. అందుకే టైర్‌లో ప్రెజర్ లెవెల్ ఎప్పుడూ కార్ కంపెనీ స్టాండర్డ్‌లో ఉండేలా చూసుకోవాలి.

2. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి: కారును చాలా జాగ్రత్తగా నడపాలి. యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ కూడా సౌకర్యవంతంగా ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

3. ట్రిప్: తక్కువ దూరం ప్రయాణాలు చేస్తే ఇంధన వినియోగం ఎక్కువ అవుతుంది. అదే సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడంలో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది.

4. కారు విండో: కారు విండో గ్లాస్ తెరవడం లేదా మూసివేయడం కూడా మైలేజీపై ప్రభావం చూపుతుంది. నిజంగా ఆశ్చర్యపోతారు గానీ.. అధిక వేగంతో వెళ్తున్న సమయంలో విండోలను తెరవడం వలన ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది.

5. గేర్: ఇంజిన్‌పై ఒత్తిడి లేకుండా కారును టాప్ గేర్లలోనే నడపాలి. అధిక వేగంతో లో గేర్‌లో నడిపితే మైలేజీ తక్కువగా వస్తుంది.

6. బరువు: కారులో అధిక బరువు ఉండటం కూడా మైలేజీపై ప్రభావం చూపుతుంది. అధిక బరువు ఇంజిన్‌పై ఒత్తిడి తెస్తుంది. అందుకే అనవసరమైన వస్తువులను కారులో ఉంచవద్దు.

7. కారు స్విచ్ ఆఫ్ చేయాలి: అవసరం లేనప్పుడు లేదా ఎవరి కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు కారును స్టార్ట్ చేయకూడదు. మీకు బడ్జెట్ ఉంటే, ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో కూడిన కారును కొనుగోలు చేయడం మంచిది.

8. కారును శుభ్రంగా ఉంచాలి: కారులో మురికిగా ఉన్న ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం మంచిది. అదే సమయంలో కారును సమయానికి సర్వీస్ చేయడం వల్ల కూడా మైలేజీ మెరుగుపడుతుంది.

9. రూట్ ప్లానర్: ఎక్కడికైనా వెళ్లే ముందు రూట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. దీంతో ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం వంటి వాటిని నివారించవచ్చు. ప్రతిరోజూ ప్రయాణిస్తున్నట్లయితే బిజీ సమయానికి 10 నిమిషాల ముందు ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. అలా ట్రాఫిక్ తప్పించుకోవడం వలన మైలేజీ తగ్గుతుంది.

10. నడక: ప్రతిదానికి కారులో వెళ్లాల్సిన అవసరం లేదు. కొద్ది దూరమే అయితే.. కాలి నడకన వెళ్లడం చాలా ప్రయోజనకరం. మార్కెట్, ఫెయిర్ వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరైన స్థలంలో కారును పార్క్ చేయాలి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..