Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypersomnia: పగటిపూట ఎక్కువగా నిద్రపోతున్నారా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు.. తెలుసుకోండి..

తగినంత నిద్ర పొందడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. కానీ కొందరికి ఎప్పుడూ నీరసంగా..

Hypersomnia: పగటిపూట ఎక్కువగా నిద్రపోతున్నారా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు.. తెలుసుకోండి..
Sleeping
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2022 | 9:31 PM

తగినంత నిద్ర పొందడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. కానీ కొందరికి ఎప్పుడూ నీరసంగా, నిద్ర మత్తుగా అనిపిస్తుంటుంది. రోజంతా నిద్రపోతూనే ఉంటారు. అలా అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోతారు. వాస్తవానికి ఆరోగ్యపరంగా ఇది చాలా హానీకరం. ఇలా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడాన్ని వైద్య పరిభాషలో హైపర్సోమ్నియా అని అంటారు.

హైపర్సోమ్నియా అంటే ఏమిటి?

హైపర్సోమ్నియాతో బాధపడే వ్యక్తి అన్ని వేళల్లో నిద్రపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఉదయం వేళ నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా మళ్లీ మగతగానే ఉంటారు. నిద్రలోకి జారుకుంటారు. మళ్లీ మళ్లీ నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. వీరు నిద్ర లేకుండా జీవించలేరు. ప్రతిరోజూ ఇలాగే ఉంటుంది. రోజువారి పనులను పూర్తి చేయడం వీరికి పెను సవాల్‌గా ఉంటుంది.

నిద్రలేమి సమస్యకు, హైపర్సోమ్నియాకు చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట నిద్రలేమి సమస్య వేధిస్తుంటుంది. దానికి హైపర్సోమ్నియాకు సంబంధం లేదు. హైపర్సోమ్నియాలో ఒక వ్యక్తి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోయినప్పటికీ.. పగటిపూట అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అన్ని సమాయాల్లో నిద్రమబ్బుగా ఉంటారు. ఛాన్స్ దొరికితే నిద్రపోతారు. ఇది సాధారణ నిద్రకంటే ఎక్కువగా నిద్రపోతారు.

ఇవి కూడా చదవండి

హైపర్సోమ్నియా సమస్య ఎందుకొస్తుంది?

ఇది ఊపిరితిత్తుల వ్యాధి, నరాల సమస్యలు లేదా మెదడు సంబంధిత సమస్యల వల్ల ఈ హైపర్సోమ్నియా సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. హైపర్సోమ్నియాకు నిర్ధిష్ట కారణం ఏమీ లేదంటున్నారు.

ఈ సమస్య వారిలో ఎక్కువ..

మహిళలు హైపర్సోమ్నియాకు ఎక్కువగా గురవుతారని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, 24 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు, పెద్దలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాల్సి ఉంటుందని, అలా అయితే, దీనిని నియంత్రించగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..