Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar: ఉదయం సమయంలో షుగర్ స్థాయి ఎక్కువుగా ఉంటుందా.. ఈ సింపల్‌ టిప్స్‌తో నియంత్రించండి..

మధుమేహం ఉన్న వ్యక్తులు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఒక పూట భోజనం చేయడం, మరోపూట చపాతి లేదా తినడం వంటివి ఎక్కువ చేస్తారు. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎంత పనిలో ఉన్నా..

Blood Sugar: ఉదయం సమయంలో షుగర్ స్థాయి ఎక్కువుగా ఉంటుందా.. ఈ సింపల్‌ టిప్స్‌తో నియంత్రించండి..
Blood Sugar
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 01, 2022 | 1:06 AM

మధుమేహం ఉన్న వ్యక్తులు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఒక పూట భోజనం చేయడం, మరోపూట చపాతి లేదా తినడం వంటివి ఎక్కువ చేస్తారు. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎంత పనిలో ఉన్నా సరే.. వారనుకున్న సమయం అయిందంటే భోజనం చేసేయాల్సిందే. అయితే రాత్రి సమయంలో ఆహారం మితంగా తీసుకున్నప్పటికి.. ఉదయం లేచే సమయానికి షుగర్ స్థాయి ఎక్కువుగా ఉండొచ్చు. చాలా మంది వ్యక్తులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. మధుమేహం ఉన్నవారిలో ఉదయం పూట గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. తెల్లవారుజామున శరీరం గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచడానికి కాలేయానికి సంకేతాలు ఇస్తుంది, ఇది మిమ్మల్ని మేల్కొలపడానికి సహాయపడే శక్తిని అందిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి ప్యాంక్రియాస్‌లోని కణాలను ప్రేరేపిస్తుంది. కానీ మీకు మధుమేహం ఉంటే, మీ శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవచ్చు. లేదా రక్తంలో చక్కెర పెరుగుదలను ఎదుర్కోవడానికి ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఫలితంగా మీరు మేల్కొన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ అధికంగా ఉన్నట్లు చూపిస్తుంది. కొన్ని కారణాల వల్ల బ్లడ్ షుగర్ ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ముందు రోజు రాత్రి మీ శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం లేదా వైద్యులు సిఫార్సు చేసిన మందులు సరిగ్గా వాడకపోవడం, నిద్ర పోవడానికి ముందు అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినడం కారణంగా ఉదయం లేవగానే బ్లడ్ షుగర్ స్థాయి ఎక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది.

ఈ ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్ యొక్క ప్రభావం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయితే బ్లడ్ షుగర్ స్థాయి ఒక్కసారిగా పెరుగుతూ ఉంటే.. దానిని నియంత్రించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. రాత్రి నిద్రపోవడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, అది రాత్రంతా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉదయం లేవగానే ఎక్కువ శాతం షుగర్ ఉన్నట్లు చూపిస్తుంది. మీ గ్లూకోజ్ స్థాయిలలో గణనీయమైన వ్యత్యాసాన్ని గమనించడానికి తినే ఆహారంతో పాటు డిన్నర్ సమయాన్ని మార్చుకోవల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడానికి ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలవాకింగ్ వంటి కొన్ని ప్రాథమిక శారీరక వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది.

సరైన డైటింగ్ నియమాలు పాటిస్తున్నా.. మీబ్లడ్ షుగర్ స్థాయి ఎక్కువుగా ఉంటే.. తగినంత ఇన్సులిన్‌ను ఉపయోగించడం లేదని లేదా రోజులో చేయాల్సి సమయంలో ఇంజెక్షన్ చేయడంలేదని అర్థం. ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నియంత్రించడంలో వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతున్నట్లయితే, రాత్రి భోజనం తర్వాత వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడంలో సహాయపడతాయి. ఫుగర్ ఎక్కువుగా ఉన్నవాళ్లు రాత్రి సమయంలో భోజనం (రైస్ ఐటమ్స్) తినడం మానుకోవాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఉదయం సమయంలో షుగర్ స్థాయి ఎక్కువుగా ఉండే సమస్యనుంచి ఉపశమనం పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..