Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. విటమిన్-ఎ ఉండే పదార్థాలు ఇవే..

కాలంతో పాటు మనుషుల జీవనశైలి మారిపోతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్‌లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర వేళలు మారిపోతుండటంతో వ్యాధుల ముప్పు అధికమవుతోంది. అందుకే ప్రస్తుతం..

Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. విటమిన్-ఎ ఉండే పదార్థాలు ఇవే..
Dry Fruits
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 01, 2022 | 5:40 AM

కాలంతో పాటు మనుషుల జీవనశైలి మారిపోతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్‌లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర వేళలు మారిపోతుండటంతో వ్యాధుల ముప్పు అధికమవుతోంది. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. తినే తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది మంచిదైతే దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్, అంజీర్, రైసిన్స్ ఇలా వేటికవే ప్రత్యేకంగా పోషక విలువను కలిగి ఉన్నాయి. మంచి కొవ్వులు, విటమిన్లతో పాటు అనేక రకాల ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పు, బాదంపప్పుల్లో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్‌ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడకుండా కాపాడుతుంది. ఎండుద్రాక్షలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. గింజపప్పులు, ఎండుఫలాలు కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ తోడ్పడతాయి. పొటాషియం, విటమిన్‌ ఎ, పీచు, రాగి ఒంట్లో శక్తి తగ్గకుండా చూస్తాయి.

జీడిపప్పులో రాగి ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇవి ఎముక పుష్టికి, మంచి చూపుకు సహాయపడతాయి. బాదంపప్పులో కాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయి. వాల్‌నట్స్‌ లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.

ప్రధానంగా చలికాలంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు రోజూ డ్రైఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ అనేవి పోషకాలలో నిండి ఉంటాయి. చలికాలంలో చాలా మంచిది. డ్రైఫ్రూట్స్‌ను పెరుగు, ఓట్స్, దలియాల్లో నానబెట్టి ఉదయం పరగడుపు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల బాడీ ఆరోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మస్తిష్కం వేగవంతమౌతుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి చాలా మంచిది. అందుకే ప్రతిరోజూ పరగడుపున బాదాం తినడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  చూడండి.