Chicken Tikka Masala: చికన్ టిక్కా మసాలాను ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.. వీడియో చూసి నేర్చుకోండి
ఇప్పుడు.. విదేశీ ఫుడ్ బ్లాగర్లు కూడా.. భారతీయ వంటకాలను ట్రై చేస్తున్నారు. తాజాగా ప్రముఖ అమెరికన్ బ్లాగర్ మై న్గుయెన్ ప్రముఖ ఇండియన్ ఫుడ్ చికెన్ టిక్కా మసాలాను తయారు చేశారు. ఈ రుచికరమైన వంటకం.. ఫుడ్ బ్లాగర్ ఫాలోవర్స్ తో పాటు.. భారతదేశంలోని ఆహార ప్రియులను కూడా బాగా ఆకట్టుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ భారతీయ వంటకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. మనకు ఇష్టమైన ఆహారపదార్ధాలు.. రెస్టారెంట్లలోనే కాదు.. తమ ఇంటిలో కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిండీ కాలింగ్ నుండి పద్మా లక్ష్మి వరకు.. భారతీయుల ఆహారాన్ని ట్రై చేస్తున్నారు. హాలీవుడ్ దివాస్‌లో కొన్ని రుచికరమైన ఇండియన్ ఫుడ్ ను వండి.. ఆహారప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు.. విదేశీ ఫుడ్ బ్లాగర్లు కూడా.. భారతీయ వంటకాలను ట్రై చేస్తున్నారు. తాజాగా ప్రముఖ అమెరికన్ బ్లాగర్ మై న్గుయెన్ ప్రముఖ ఇండియన్ ఫుడ్ చికెన్ టిక్కా మసాలాను తయారు చేశారు. ఈ రుచికరమైన వంటకం.. ఫుడ్ బ్లాగర్ ఫాలోవర్స్ తో పాటు.. భారతదేశంలోని ఆహార ప్రియులను కూడా బాగా ఆకట్టుకుంది.
ఆమె షేర్ చేసిన వీడియోపై ఓ లుక్ వేయండి..
View this post on Instagram
మై న్గుయెన్ అధికారిక బ్లాగర్ @myhealthydish లో ఈ వీడియోలో షేర్ చేశారు. ఈ వీడియోకి క్యాప్షన్‌లో.. జనాదరణ పొందిన బటర్ చికెన్‌కు బదులుగా చికెన్ టిక్కా మసాలా చేయడానికి ఎందుకు ఇష్టపడతానో ఆమె వెల్లడించింది . “చికెన్ టిక్కా మసాలా కోసం నా రెసిపీని సేవ్ చేసుకోండి.. నేను నిజానికి బటర్ చికెన్ కంటే దీన్ని ఇష్టపడతాను ఎందుకంటే రెండిటిని తయారు చేసే పదార్థాల్లో చాలా సారూప్యం ఉన్నప్పటికీ ఇది కొంచెం ఆరోగ్యకరమైనది” అని ఆమె పేర్కొంది.
తన వీడియోలో అమెరికన్ బ్లాగర్ కొన్ని సాధారణ ప్రత్యామ్నాయాలతో రుచికరమైన చికెన్ టిక్కా మసాలాను ఎలా తయారు చేసిందో చూపించింది. ఆమె తాజాగా తెచ్చిన టొమాటోలను కాకుండా గ్రేవీలో క్యాన్డ్ టమోటాలను ఉపయోగించింది. అంతేకాదు.. మెంతులను కొంతమంది ఇష్టపడరు కనుక వాటిని ఈ రెసిపీలో విడిచి పెట్టవచ్చు అని సలహా ఇచ్చింది. క్రీమ్, వెన్నకి బదులు.. న్గుయెన్ క్రీమ్ కోసం నానబెట్టిన జీడిపప్పులను ఉపయోగించింది. కనుక చికెన్ టిక్కా వంటకం బటర్ చికెన్ రెసిపీ కంటే ఆరోగ్యకరమైనది.. ఇందులో క్రీమ్, వెన్నతో కూడిన ఒడిల్స్‌ను ఉపయోగించింది.
అమెరికన్ బ్లాగర్ చికెన్ టిక్కా మసాలా తయారు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్‌గా మారింది. ఇది ఇప్పటికే 5.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 200k లైక్‌లను సంపాదించింది. భారతీయ వంటకాల్లో అద్భుతమైన వంటకం తయారు చేయడం ప్రయత్నించినందుకు చాలా మంది వినియోగదారులు న్గుయెన్‌పై ప్రశంసలు కురిపించారు . అది అద్భుతంగా ఉంది,” అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు, “ఈ రోజు మీరు రెసిపీ ని అనుసరించి ఈ వంటకాన్ని తయారు చేస్తాను అంటే.. విదేశాలలో నివసిస్తున్న కొంతమంది భారతీయలు “ఇక్కడ కూడా మెంతులు దొరుకుతాయి, దీనిని “కసూరి మేతి” అని కూడా పిలుస్తారు” అని సూచించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..