Plastic Straw: మీరు ప్లాస్టిక్ స్ట్రా తో తాగుతున్నారా? అయితే, వెంటనే విసిరిపారేయండి.. లేదంటే రిస్క్‌ తప్పదు..!

అంతేకాదు, ప్లాస్టిక్ స్ట్రా లు ఎక్కువగా వాడేవారిలో తొందరగా వృద్ధాప్య సంకేతాలు బయటపడతాయంటున్నారు. మీరు ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగించి ఏదైనా తాగినప్పుడు, అది నేరుగా మీ దంతాలు, ఎనామిల్‌ను తాకుతుంది. ఇది మీ మోలార్‌లను దెబ్బతీస్తుంది.

Plastic Straw: మీరు ప్లాస్టిక్ స్ట్రా తో తాగుతున్నారా? అయితే, వెంటనే విసిరిపారేయండి.. లేదంటే రిస్క్‌ తప్పదు..!
Plastic Straw
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2022 | 12:34 PM

మనం సాధారణంగా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాని ఉపయోగిస్తాము. కానీ, ఇదే ప్లాస్టిక్ స్ట్రా ఆరోగ్యానికి, అందానికి హాని చేస్తుంది. ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి తాగితే, మీరు తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగుతారు. అటువంటి పరిస్థితిలో అధిక కేలరీల కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌ మీకు తెలియకుండానే తాగేస్తుంటారు. ఇలాంటి చిన్న సిప్స్ మీరు బరువు పెరిగేలా చేస్తుంది. ఇది మీ ఆకలిని పెంచుతుంది. శరీరానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్ స్ట్రా ఉపయోగించడం వల్ల ఇంకా అనేక ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

ప్లాస్టిక్‌ స్ట్రాలు వాడే వారిలో నోటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం విషయంలో చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఏదో ఒక కూల్‌డ్రింక్‌ తాగటం, జ్యూస్‌లు, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినేస్తుంటారు. అయితే, దంత క్షయం, కుహరం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలు స్ట్రా సహాయంతో కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. మీరు ప్లాస్టిక్ స్ట్రాను ఉపయోగించి ఏదైనా తాగినప్పుడు, అది నేరుగా మీ దంతాలు, ఎనామిల్‌ను తాకుతుంది. ఇది మీ మోలార్‌లను దెబ్బతీస్తుంది.

శరీరంలోకి విష రసాయనాలు చేరే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ స్ట్రాలు పాలీప్రొఫైలిన్‌తో తయారు చేయబడతాయి. మీరు స్ట్రాస్ నుండి డ్రింక్స్ తాగినప్పుడు అది నేరుగా మీ శరీరంలోకి వెళ్లడం ద్వారా మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్‌ స్ట్రా ఎక్కువగా వాడే వారు తెలియకుండానే బరువు పెరగడం మొదలవుతుంది. ప్లాస్టిక్ స్ట్రాలతో మీరు జ్యూస్, కోల్డ్ కాఫీ తాగుతుంటారు. దీని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది మీ ఆకలిని కూడా పెంచుతుంది.

అంతేకాదు, ప్లాస్టిక్ స్ట్రా లు ఎక్కువగా వాడేవారిలో తొందరగా వృద్ధాప్య సంకేతాలు బయటపడతాయంటున్నారు. మీరు స్ట్రా ను ఉపయోగించి ఏదైనా డ్రింక్ ను ఎక్కువసార్లు పీల్చుకున్నప్పుడు మీ ముఖంపై ముడతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి