- Telugu News Photo Gallery Health tips benefits of black tea reduces danger of heart attack health tips in Telugu
Black Tea Benefits : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్ఫెక్ట్
ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Dec 01, 2022 | 11:37 AM

ఖాళీ కడుపుతో పాలతో టీ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, పాలు, చక్కెర లేకుండా టీ తయారు చేస్తే అది బ్లాక్ టీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు. భోజనం లేదా అల్పాహారం తర్వాత కొద్దిసేపటికే వెచ్చని బ్లాక్ టీ తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

బ్లాక్ టీ గుండెకు ఆరోగ్యకరం. బ్లాక్ టీ తాగడం వల్ల గుండె చుట్టూ ఉండే ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండెను సురక్షితంగా ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంతేకాదు బ్లాక్ టీ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లాక్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.

బ్లాక్ టీ మెనోపాజ్ సమయంలో మహిళలకు అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ జీర్ణవ్యవస్థ సమస్యలను సరిదిద్దడంలో సహాయపడుతుంది.

ఈ బ్లాక్ టీ మిమ్మల్ని మరింత శక్తివంతంగా ఉంచుతుంది, చర్మం, జుట్టును మెరుగుపరుస్తుంది. మానసిక దృష్టిని నిర్వహించడానికి,ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోబాధపడేవారు ప్రతి రోజూ బ్లాక్ టీ ని తీసుకుంటే మంచిది. బ్లాక్ టీలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. అలాగే ఈ టీని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.





























