Dragon Fruit Benefits: ప్రతిరోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ హాంఫట్

ఇది శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, డ్రాగన్ ఫ్రూట్ మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే కొన్ని రకాల రోగాలు దరిచేరవంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

Dragon Fruit Benefits: ప్రతిరోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ హాంఫట్
Dragon Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2022 | 12:20 PM

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా కనిపించేది డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు గురించి మన దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో తెలియనివారున్నారు. కొందరికి ఈ ఫ్రూట్ తెలిసినా.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు అస్సలు తెలియదు. అయితే ఇప్పుడిప్పుడే దీనిని తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా తీపి, కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటుంది, కొంతమందికి ఇది ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే పండు. ఇది శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, డ్రాగన్ ఫ్రూట్ మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే కొన్ని రకాల రోగాలు దరిచేరవంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పండు ఖరీదు కాస్త ఎక్కువే. మార్కెట్‌లో వివిధ రకాల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

1. ఈ పండు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉంటే, బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే, మీ డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని ఖచ్చితంగా చేర్చుకోండి. ఎందుకంటే అటువంటి పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జీవక్రియను పెంచుతుంది. వేగంగా బరువు తగ్గటానికి దోహదపడుతుంది.

2. గర్భధారణ సమయంలో రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తక్కువ హిమోగ్లోబిన్ శిశు మరణాలు, తక్కువ బరువు, గర్భస్రావం వంటి సమస్యలను నివారిస్తుంది. వాస్తవానికి, గర్భధారణ సమయంలో మహిళలు రక్తహీనత ప్రమాదానికి గురవుతారు. ఇది ఐరన్‌ లోపం వల్ల వస్తుంది. రక్తహీనత యొక్క లోపాన్ని అధిగమించడానికి వైద్యులు మందులు వాడమని సూచిస్తు్ంటారు. అయితే మీరు ఆ మందులతో ఆపాటుగా డ్రాగన్ ఫ్రూట్‌ని కూడా తీసుకోవటం మంచిది.

ఇవి కూడా చదవండి

3. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి..డ్రాగన్ ఫ్రూట్ వాపును నివారిస్తుంది. మీరు కీళ్లనొప్పుల కారణంగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నవారికి డ్రాగన్ ఫ్రూట్‌ మంచిది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లు, కండరాలలో తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. వాపును తగ్గిస్తాయి.

4. చర్మ ప్రయోజనాలు డ్రాగన్ ఫ్రూట్ మీ చర్మానికి అద్భుతాలు చేయగలదు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ముఖ్యమైనది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి సన్‌బర్న్‌ని తగ్గిస్తుంది. కాలిన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్ రాకుండా చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి