Chocolate Health Benefits: ఈ చాక్లెట్‌తో మీ గుండె ఫీట్‌గా ఉంటుంది.. చర్మం మెరిసిపోతుంది.. ఒత్తిడి ఇట్టే మాయం..!

ఇందులో ఉండే పెయిన్ రిలీవింగ్ ఎండార్ఫిన్ పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజుకు ఒక చాక్లెట్ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Chocolate Health Benefits: ఈ చాక్లెట్‌తో మీ గుండె ఫీట్‌గా ఉంటుంది.. చర్మం మెరిసిపోతుంది.. ఒత్తిడి ఇట్టే మాయం..!
Dark Chocolate
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 01, 2022 | 9:22 PM

చాలా మంది చాక్లెట్స్‌ను తినడానికి ఇష్టపడతారు. ఇది తీపిగా నోటికి రుచిని కలిగి ఉన్నప్పటికీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పండగ జరిగినా, బర్త్‌డే పార్టీ జరిగినా, ఏదైనా శుభకార్యానికి ముందు చాలా మంది ఇళ్లల్లో చాక్లెట్‌తో మొదలవుతుంది. నేడు పిల్లలు, పెద్దలు ఇతర తీపి ఆహారాల కంటే చాక్లెట్లను ఎక్కువగా ఇష్టపడతారు. చాక్లెట్‌లో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెస్తుందని అనుకోవద్దు.. ఎందుకంటే.. చాక్లెట్‌ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా మనం తెలుసుకుందాం.

చాక్లెట్ తినాలంటే డార్క్ చాక్లెట్ తినాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భధారణ సమయంలో డార్క్ చాక్లెట్ లాభదాయకం. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అటువంటి పరిస్థితిలో గర్భధారణ సమయంలో దీనిని తీసుకోవడం ద్వారా బిడ్డ, తల్లి ఇద్దరూ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించబడతారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది..అవును డార్క్ చాక్లెట్‌లో సెరోటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఒత్తిడి, నొప్పిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఒక పరిశోధన ప్రకారం వారానికి ఒకటి లేదా రెండుసార్లు డార్క్ చాక్లెట్ తినే స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. ప్రతిరోజు రెండు లేదా ఒకటి డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను ఫీట్ గా చేసేందుకు కూడా సహాయపడతాయని తెలిపారు.

డార్క్ చాక్లెట్‌లో ఉండే పెయిన్ రిలీవింగ్ ఎండార్ఫిన్ పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజుకు ఒక డార్క్ చాక్లెట్ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.

పంటి నొప్పి, కావిటీల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు.. కానీ, డార్క్ చాక్లెట్‌లో ఉండే, థియోబ్రోమిన్ పంటి ఎనామెల్‌ను బలపరుస్తుంది. క్షయం, కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

స్కిన్ బెనిఫిట్స్ రీసెర్చ్ ప్రకారం పరిమిత మొత్తంలో డార్క్ చాక్లెట్ తీసుకునే మహిళలు యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించే చర్మం కలిగి ఉంటారు. దీంతో ఫైన్ లైన్లు, ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలు తగ్గుతుంది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.