Afghanistan: తాలిబ్ పాలనలో ఆకలి కేకలు.. ఆడ పిల్లల అమ్మకాలు.. చిన్నారులకు స్లీపింగ్‌ పిల్స్‌..

ఒక పేద తండ్రి తాను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించిన తన సొంత కూతురిని అమ్మకానికి పెడుతున్నాడు.. మరొకొందరు తమ అవయవాలను అమ్ముకుంటున్నారు.. అవును తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘన్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతుంది.

Afghanistan: తాలిబ్ పాలనలో ఆకలి కేకలు.. ఆడ పిల్లల అమ్మకాలు.. చిన్నారులకు స్లీపింగ్‌ పిల్స్‌..
Afghanistan Food Crisis
Follow us
Surya Kala

|

Updated on: Nov 29, 2022 | 2:31 PM

ఆకలి కేకలు.. ఆడ పిల్లల అమ్మకాలు.. అన్నం పెట్టలేక చిన్నారులకు స్లీపింగ్‌ పిల్స్‌.. ఆప్ఘనిస్థాన్‌ ప్రజల దారుణాతి దారుణ పరిస్థితులివి.  ప్రపంచానికి దిగ్భ్రాంతిని కలిగించేలా మానవత్వం సిగ్గుపడేలా.. నవ నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునేలా  ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు అత్యంత భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆకలితో ఉన్న తన బిడ్డకు కడుపునిండా తిండి పెట్టలేక నిద్రపోయేలా  ఓ తల్లి మత్తు మందులు వేస్తోంది.. ఒక పేద తండ్రి తాను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించిన తన సొంత కూతురిని అమ్మకానికి పెడుతున్నాడు.. మరొకొందరు తమ అవయవాలను అమ్ముకుంటున్నారు.. అవును తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘన్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతుంది.

అక్కడ ప్రజలకు చేయడానికి పనిలేదు. చేతిలో డబ్బులు లేవు. వేలాది మందికి ఒక్కపూట కూడా తిండి దొరకడం లేదు. కనీసం పిల్లలకు కూడా తిండి పెట్టలేని కుటుంబాలు వారికి స్లీపింగ్‌ పిల్స్‌ ఇచ్చి నిద్రపోయేలా చేస్తున్నాయి. కొన్ని కుటుంబాలు తమ ఇంటి ఆడపిల్లల్ని పెళ్లి పేరుతో అమ్మేస్తున్నారు. ఇంకొందరు తమ శరీరంలోని అవయవాలు అమ్ముకుంటున్న ఘోరాతి ఘోర పరిస్థిత ఆప్ఘన్ ప్రజలది. ఆ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఏడాదిన్నర కూడా కాలేదు. ఇంతలోనే అక్కడి ప్రజలు ఇంతటి దుర్భర జీవితంలోకి వెళ్లిపోయారు. ఆ దేశానికి ఒక్క పైసా కూడా విదేశీ సాయం అందడం లేదు.

ఆకలి నుంచి కుటుంబసభ్యులను బయటపడేసేందుకు కొంత మంది తల్లిదండ్రులు తమ కూతుర్లను 2 నుంచి 2.5 లక్షలకు అమ్ముకుంటున్నట్టు ఏఎఫ్‌పీ నివేదిక చెప్తోంది. నిజాముద్దీన్ అనే ఓ స్థానికుడు తన ఐదేండ్ల కూతురిని 90 వేలకు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. వలస వెళ్లలేక, అక్కడే బ్రతకలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. తాలిబన్ ప్రభుత్వం చేసిన ప్రకటన వాళ్లను మరింత కుంగదీస్తోంది. ఈ పరిస్థితి ఎంత మాత్రమూ ప్రభుత్వ సమస్య కాదని తాలిబాన్‌ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మీరు ఎలాగైనా చావండి. మాకు సంబంధం లేదు. కానీ మీరు సంపాదిస్తే మాత్రం మాకు పన్నులు కట్టండి అనే రీతిలో తాలిబన్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఆప్ఘనిస్థాన్ ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!