Argentina Couple: కళ్ళతో సహా ఒంటి నిండా టాటూలు.. గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన వింత జంట..

ఓ జంట 98 బాడీ మోడిఫికేషన్లు చేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కళ్లు, నాలుకతో పాటు శరీరం మొత్తం టాటూలతో నింపేసుకున్నారు. విక్టర్ హ్యూగో పెరాల్టా, గాబ్రియేలా పెరాల్టా అనే ఈ జంట ప్రపంచంలోనే తమ శరీరంలో అత్యధిక మార్పులు చేసుకున్న వ్యక్తులుగా రికార్డు సాధించారు.

Argentina Couple: కళ్ళతో సహా ఒంటి నిండా టాటూలు..  గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన వింత జంట..
Couple Guinness World Records
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 12:53 PM

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అనీ.. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొందరి అభిరుచులు విచిత్రంగా అనిపిస్తాయి. కొందరైతే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం రకరకాల ప్రయోగాలు, సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఓ జంట ఒంటినిండా టాటూలు వేసుకొని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కారు. అర్జెంటీనాకు చెందిన ఓ జంట 98 బాడీ మోడిఫికేషన్లు చేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కళ్లు, నాలుకతో పాటు శరీరం మొత్తం టాటూలతో నింపేసుకున్నారు. విక్టర్ హ్యూగో పెరాల్టా, గాబ్రియేలా పెరాల్టా అనే ఈ జంట ప్రపంచంలోనే తమ శరీరంలో అత్యధిక మార్పులు చేసుకున్న వ్యక్తులుగా రికార్డు సాధించారు. భార్యాభర్తలిద్దరూ ముఖం నుంచి కాళ్ల వరకు పచ్చబొట్లు, ఇంప్లాంట్లు, కుట్లు వేసుకున్నారు. విక్టర్, గాబ్రియేలా ఇద్దరూ తమ శరీరం మొత్తం టాటూలతో పెయింట్ చేయించుకున్నారు.

మొత్తం 50 బాడీ పియర్సింగ్‌లు, 8 మైక్రోడెర్మల్, 14 బాడీ ఇంప్లాంట్లు, 5 డెంటల్ ఇంప్లాంట్లు చేసుకున్నారు. అలాగే వారికి 4 ఇయర్ ఎక్స్‌పాండర్లు, 2 ఇయర్ బోల్ట్‌లు, ఫోర్క్‌డ్‌ నాలుక కూడా ఉన్నాయి. అంతే కాదండోయ్‌, ఈ జంట తమ కళ్ల లోపల కూడా టాటూలు వేయించుకుని పూర్తిగా నలుపు రంగులో మార్చేసుకున్నారు. 24 ఏండ్ల క్రితం ఓ మోటర్‌ సైకిల్‌ పోటీల్లో కలుసుకున్నారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. అనంతరం వివాహం చేసుకున్నారు.

ఇద్దరు అభిరుచులూ ఒకటే కావడంతో.. 2009 నుంచి ఇలా ఒంటిపై టాటూలు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు 20 దేశాలను చుట్టివచ్చారు.. ఆయా దేశాల్లోని ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ కొత్త కొత్త స్నేహితులను ఎంతోమందిని సంపాదించుకున్నారు. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి.. ఆర్ట్‌ను ఎంజాయ్‌ చేయాలి.. ఈ టాటూల్లో ఎన్నో ఆలోచనలు మిలితమై ఉన్నాయంటున్నారు విక్టర్‌ గాబ్రియేలా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..