Boyfriend gift: గిఫ్ట్ చేతికొచ్చాకా ఊహించని షాక్ ఇచ్చిన ప్రియురాలు.. నెట్టింట సందడి చేస్తున్న ఫన్నీ వీడియో..
అమ్మాయిలను ఆకర్శించడానికి అబ్బాయిలు నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.. తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రస్ చేయడానికి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది అమ్మాయిలు
అమ్మాయిలను ఆకర్శించడానికి అబ్బాయిలు నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.. తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రస్ చేయడానికి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను చాలా సార్లు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అబ్బాయి దారుణంగా మోసపోయాడు. అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. నెట్టింట్లో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రియురాలు తన ప్రియుడి కోసం బాల్కనీలో ఎదురుచూస్తుంది. కొద్దిసేపటికే ఆమె ప్రియుడు అక్కడికి వచ్చాడు. అమ్మాయి తన ప్రియుడికి హాయ్ చెప్పింది. వెంటనే ఆమె ప్రియుడు ఒక బాక్స్ ఆమెవైపు విసిరాడు. ఆ బాక్స్ క్యాచ్ పట్టుకున్న ఆ ప్రేయసి తెగ ఆనందపడిపోతూ చూపించింది. అది ఐఫోన్. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె అమ్మాయి కాదు. ఫోన్ రాగానే అమ్మాయిలా ఉన్న వ్యక్తి మాస్క్ తీసి మొహాన్ని చూపించాడు. పొడవాటి కురులతో..అమ్మాయిగా వేషం వేశాడు. దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతే కాదు అమ్మాయి వేషం వేసుకొని ఐఫోన్ కొట్టేశావుగా నువ్వు సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

