పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. అది స్నేహితుడు, సహోద్యోగి అయినా, మీరు వారిలో ఎవరో ఒకరి ఆహ్వానాన్ని అందుకొనే ఉంటారు. అది ప్రేమ వివాహం కావచ్చు లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి కావొచ్చు. పగటి వివాహం కావచ్చు లేదా రాత్రి ఈవెంట్ కావచ్చు. చిన్నది లేదా పెద్దది. కానీ, మీరు ఇలాంటి వింత వివాహం గురించి విన్నారా..? దీనిని దెయ్యాల పెళ్లి అంటారు. చైనాలో దెయ్యాల వివాహం అనేది పురాతన సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది ఇప్పటికీ ఆ దేశంలో కొనసాగుతుందని మీకు తెలుసా..?