AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zika Virus: దేశంలో మరోసారి వైరస్ కలకలం.. జికా జడలువిప్పుకుంటోంది.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

నవంబర్ 18న ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీలో అతడికి పరీక్షలు నిర్వహించగా జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

Zika Virus: దేశంలో మరోసారి వైరస్ కలకలం.. జికా జడలువిప్పుకుంటోంది.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
దోమల బెడద కారణంగా ఏటా వేలాది మంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంకా ఈ వ్యాధి కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ ఇళ్లలో దోమల నివారణకు వివిధ రకాల మందులను ఉపయోగిస్తారు. అయినప్పటికీ, దోమల సమస్య పరిష్కారం కాదు. అయితే ఇక ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లోని ఔషధ మొక్కలు నాటడం ద్వారా దోమలను దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల సువాసనలును వెదజల్లే ఈ మొక్కలు సహజంగానే దోమలకు వికర్షకాలుగా పనిచేస్తాయి. తద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. మరి ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..
Jyothi Gadda
|

Updated on: Dec 03, 2022 | 1:18 PM

Share

దేశంలో మరోమారు జికా వైరస్‌ కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి పంజా నుంచి బయటపడ్డ ప్రజల్ని జికా వైరస్‌ హడలెత్తిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో జిక జడలు విప్పుకుంటోంది. పూణేలోని బవ్‌ధాన్ ప్రాంతంలో 67 ఏళ్ల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతడు తీవ్రమైన జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, ఆయాసంతో జహంగీర్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చాడు. ఆయనకు నవంబర్ 18న ప్రైవేట్ ల్యాబొరేటరీలో జికా సోకినట్లు నిర్ధారణ అయింది. భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పూణె నగరం అంతటా జికా వైరస్‌కు సంబంధించిన ఎంటమోలాజికల్ సర్వే జరుగుతోంది.

బాధితుడు నాసిక్ నివాసిగా గుర్తించారు. ఈ వ్యక్తి గత నెలలో వ్యాధి బారిన పడ్డాడని, అయితే అంతకు ముందు అతను పొరుగు రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్ నగరానికి వెళ్లాడని ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అతను నవంబర్ 6న పూణేలోని బవ్‌ధాన్ ప్రాంతానికి వచ్చాడు. తరువాత సూరత్‌కు వెళ్లాడు. జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, ఆయాసం కారణంగా చికిత్స కోసం నవంబర్ 16న జహంగీర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. నవంబర్ 18న ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీలో అతడికి పరీక్షలు నిర్వహించగా జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

2016లో బ్రెజిల్ దేశంలో వెలుగుచూసిన ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించింది. మలేరియా, డెంగ్యూ మాదిరిగానే జికా వైరస్ కూడా ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. తేలికపాటి జ్వరం, శరీరంపై దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ప్రధాన లక్షణాలు. ఈ వైరస్ ఎక్కువగా నవజాత శిశువుల్లో కన్పిస్తుంది. 1947లో తొలిసారిగా జికా అడవిలో ఈ వైరస్ కనుగొనడంతో..జికా వైరస్‌గా పేరొచ్చింది. అప్పటి నుంచి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవుల్లో జికా వైరస్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి