Viral: జస్ట్ ఐరన్ బాక్స్ కాదు.. లోగుట్టు వేరే ఉంది.. విప్పితే అసలు చిత్రం కంటపడింది..
ఎయిర్‌పోర్ట్ అంటేనే భద్రతకు కేరాఫ్.. నీడలా వెంటాడే సీసీ కెమెరాలు.. ప్యాసింజర్ల కదలికల్ని పసిగట్టే సెక్యూరిటీ.. లగేజీని బిట్ టు బిట్ స్కాన్ చేసే స్కానర్లు.. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా స్మగ్లర్లు లెక్కచేయడం లేదు. మాదారి అడ్డదారి అంటూ.. విదేశాల్లో డెడ్‌చీప్‌గా దొరుకుతున్న బంగారాన్ని దేశంలోకి డంప్ చేస్తున్నారు.
ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్..ఎంత నిఘా పెట్టినా స్మగర్స్ తీరు మాత్రం మారడం లేదు. అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లోనూ పెద్దఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోంది. విదేశాల నుంచి గోల్డ్‌ను స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నా..అడ్డంగా బుక్ అవుతున్నారు. ఒకరు చెప్పుల్లో.. ఇంకొకరు ప్యాంట్ బెల్ట్‌లో.. మరొకరు బిస్కెట్ల రూపంలో.. కాదేదీ అనర్హం అంటూ గోల్డ్ స్మగ్లర్లు అన్ని అడ్డదారులు తొక్కేస్తున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్ది బంగారాన్ని వేర్వేరు స్టయిళ్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, నిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. ఏకంగా కడుపులో బంగారం పెట్టుకుని మహిళలే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు చాలానే ఉన్నాయి.
తాజాగా బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌లో అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు యత్నించాడు స్మగ్లర్. ఐతే చాకచక్యంగా వ్యవహరించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తెలివిగా ఐరన్ బాక్స్‌లో దాచి బంగారాన్ని రవాణా చేయాలని చూశాడు ఈ కేటుగాడు. కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆ వ్యక్తి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 3015.13 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐరన్ బాక్స్‌లోని స్టీల్ ప్లేట్ కింద దాచి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించగా పట్టుకున్నట్లు వెల్లడించారు.
#indiancustomsatwork #60yearsofCustomsAct1962 pic.twitter.com/4Xux921GxO
— Bengaluru Customs (@blrcustoms) December 2, 2022
ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త ఐడియాలతో కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్.. అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. తెలివిమీరిన స్మగ్లర్లు ఒంటికి బంగారం పూత పూసుకుని.. దెబ్బ తాకిందని బ్యాండేజ్‌తో కవరింగ్ ఇస్తున్నారు. మరికొందరు పౌడర్ రూపంలో రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో ఒక్కోసారి బంగారం పట్టుబడకపోయినా స్కానర్లు మాత్రం సైరన్ మోగిస్తున్నాయి. అయితే బంగారం ఎక్కడ దాచారన్నది గుర్తించేందుకు అధికారులకు పరీక్షగానే మారుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..