AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువుగా చెమట పడుతోందా.. కారణాలు ఇవే కావచ్చు.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టెయండి..

సాధారణంగా వేసవి కాలంలో వేడికి చెమటపడుతుందనుకుంటారు. కాని కొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండా తరచూ చెమటలు పడతాయి. ఈ క్రమంలో అధిక చెమట  కొందరికి చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి..

ఎక్కువుగా చెమట పడుతోందా.. కారణాలు ఇవే కావచ్చు.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టెయండి..
Sweat Smell
Amarnadh Daneti
|

Updated on: Dec 06, 2022 | 7:56 AM

Share

సాధారణంగా వేసవి కాలంలో వేడికి చెమటపడుతుందనుకుంటారు. కాని కొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండా తరచూ చెమటలు పడతాయి. ఈ క్రమంలో అధిక చెమట  కొందరికి చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌర్యం కలుగుతుంది.  శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో అధికంగా ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన విధి. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అధికంగా చెమట పట్టడాన్ని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అసౌకర్యంగా భావిస్తుంటారు.

అధికంగా చెమట పట్టడానికి ఎన్నో కారణాలుంటాయి. ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఒక్కోసారి మధుమేహం ఉన్నవారిని కూడా అధిక చెమట బాధిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పోస్తుంటాయి. సాధారణంగా అధిక చెమట సమస్య యవ్వనంలో ప్రారంభమవుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా కూడా చెమటలు పడుతుంటాయి. శరీరంలోని ఇతర భాగాల కంటే అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులే కారణం కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలు

చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో అరచేతులను తుడవాలి. బ్లాక్ టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తస్రావాన్ని నివారించగలుగుతుంది. బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇది చెమట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. తరచుగా ఈ పని చేయడం వల్ల అనుకున్న ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ టీలో 20 నిమిషాల పాటు మీ అరచేతులను ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.

కొద్ది నీటిలో గంధం వేసి పేస్టు చేయండి. దీనిని అరచేతులు, అరికాళ్లు, చంకలు వంటి ప్రదేశాల్లో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్‌ను రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది.

అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది.

తెల్లని ఉల్లిపాయ, బ్రకోలి, బీఫ్, లివర్ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!