IPL 2023: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. కట్ చేస్తే.. చెన్నై సారథిగా ప్రమోషన్.. ధోని వారసుడెవరంటే?

ఐపీఎల్ చివరి సీజన్‌లో సీఎస్‌కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేయడం గమనార్హం. అయితే సీజన్ మధ్యలో జడేజా కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. ఇప్పుడు మరోసారి జట్టు తదుపరి కెప్టెన్‌పై చర్చ జోరందుకుంది.

IPL 2023: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. కట్ చేస్తే.. చెన్నై సారథిగా ప్రమోషన్.. ధోని వారసుడెవరంటే?
Csk Team
Follow us
Venkata Chari

|

Updated on: Dec 04, 2022 | 5:40 AM

CSK Captain: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన కెప్టెన్సీలో CSK జట్టుకు నాలుగు IPL ట్రోఫీలను అందించాడు. అయితే, తాజాగా ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకునే దశలో ఉన్నాడు. ఐపీఎల్ 2023తో సారథిగా చివరి సీజన్ ఆడనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ధోని తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎవరు? ఇది చర్చనీయాంశంగా మారింది.

సీఎస్‌కే ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ, చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ రుతురాజ్ గైక్వాడ్‌లో ధోని లాంటి పోలికను కనుగొన్నాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “CSK భవిష్యత్తు కోసం ఏమి ప్లాన్ చేస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ధోని వలె రుతురాజ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు.

ధోనీలాగా సారథ్యం వహించే సత్తా ఉంది..

హస్సీ మాట్లాడుతూ, “ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో ధోనిలాగే అతను నిజంగా ప్రశాంతంగా ఉంటాడు. అతను ఆటను బాగా చదివేస్తాడు. నేను ముందే చెప్పినట్లు, అతను చాలా తెలివైనవాడు. అతని స్వభావం, పాత్ర, వ్యక్తిత్వంతో ధోనిలా ఉంటాడు. అతనికి కొన్ని అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి” అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ చివరి సీజన్‌లో సీఎస్‌కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేయడం గమనార్హం. అయితే సీజన్ మధ్యలో జడేజా కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. ఇప్పుడు మరోసారి జట్టు తదుపరి కెప్టెన్‌పై చర్చ జోరందుకుంది. దీంతో ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ భవిష్యత్‌లో చెన్నై సారథిగా కనిపించే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువయ్యాయి.

విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2022లో మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. క్వార్టర్‌ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌పై 220 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, సెమీ ఫైనల్‌లో అస్సాంపై 165 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మహారాష్ట్ర జట్టు విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌లోకి ప్రవేశించింది. కానీ, ఫైనల్‌లో ఓడిపోయింది.

మొత్తంగా విజయ్‌ హజారే టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్ 5 మ్యాచ్‌ల్లో 4 శతకాలు బాదేశాడు. కాగా, గత 10 ఇన్నింగ్స్‌ల్లో 8 శతకాలు కొట్టాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. భీకరమైన ఫాంలో ఉన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ విషయానికి వస్తే.. 2020లో ఈ పుణే యువకుడు అరంగేట్రం చేశాడు. 2021 సీజన్‌లో కీలక పాత్ర పోషించి, చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆ ఏడాది 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..