2nd Round Counselling: నేటి నుంచి కాలోజీ హెల్త్‌ వర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్‌.. చివరి తేదీ ఎప్పుడంటే..

2022-23 విద్యాసంవత్సారినికిగానూ బీఎస్సీ నర్సింగ్‌, పీబీ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాలు కల్పించడానికి ఈ రోజు (డిసెంబర్‌ 8) నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌..

2nd Round Counselling: నేటి నుంచి కాలోజీ హెల్త్‌ వర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్‌.. చివరి తేదీ ఎప్పుడంటే..
KNRUHS 2nd round counseling
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 08, 2022 | 3:47 PM

2022-23 విద్యాసంవత్సారినికిగానూ బీఎస్సీ నర్సింగ్‌, పీబీ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాలు కల్పించడానికి ఈ రోజు (డిసెంబర్‌ 8) నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు కాలోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఓ ప్రకటనలో తెల్పింది. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ డిసెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగుతుందని వర్సిటీ వెల్లడించింది. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్ధులు కాలేజీల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.