Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Peel Benefits: దానిమ్మ తొక్కను పడేస్తున్నారా? అయితే, దివ్యౌషధాన్ని పడేస్తున్నట్లే..

కూరగాయలు, పండ్లలో యాంటీఆక్సిడెంట్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ప్రజలు తొక్కలను పడేసి కాయలు, పండ్లను మాత్రమే తింటారు. కానీ, ఆ తొక్కల్లోనూ విలువైన పోషకాలు, మూలకాలు ఉంటాయి.

Pomegranate Peel Benefits: దానిమ్మ తొక్కను పడేస్తున్నారా? అయితే, దివ్యౌషధాన్ని పడేస్తున్నట్లే..
Pomegranate
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 08, 2022 | 12:45 PM

కూరగాయలు, పండ్లలో యాంటీఆక్సిడెంట్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ప్రజలు తొక్కలను పడేసి కాయలు, పండ్లను మాత్రమే తింటారు. కానీ, ఆ తొక్కల్లోనూ విలువైన పోషకాలు, మూలకాలు ఉంటాయి. ఇది తెలియక అందరూ వాటిని పడేస్తుంటారు. వాటి వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో పోషకాలు.. ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపకరిస్తాయి. అదే సమయంలో దానిమ్మ తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కల వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దానిమ్మ తొక్క ప్రయోజనం..

గొంతు నొప్పి, దగ్గు, కడుపు నొప్పి సమస్యలకు, ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ తొక్క అద్భుతంగా పని చేస్తుంది. పండులో కంటే పీల్స్‌లోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ తొక్క పొడిని ఎలా తయారు చేయాలి?

దానిమ్మ పీల్స్‌ని తీసి ఒక గిన్నెలో వేయాలి. వీటిని ఓవెన్‌లో 350 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు వేడి చేయాలి. తొక్కలు బాగా ఆరిన తరువాత వాటిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. అలా దానిమ్మ తొక్కల పొడి రెడీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పొడిని ఎలా ఉపయోగించాలి?

దానిమ్మ పొడితో టీ బ్యాగ్‌లను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఆ టీ బ్యాగ్‌ను నానబెట్టాలి. అలా చేసిన టీని వేడి వేడిగా తాగాలి. దాంతో గొంతు నొప్పి, దగ్గు, ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

చర్మం మెరిసేలా చేస్తుంది..

దానిమ్మ తొక్కల పొడి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దానిమ్మ పొడిలో కొంత నిమ్మరసం కలిపి.. పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ తరువాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తరువాత సాధారణ నీటిలో ముఖం కడుక్కోవాలి. ఇలా కొంతకాలం చేస్తే మీ ముఖం దగదగలాడుతుంది. ముఖంపై మొటిమలు తగ్గుతాయి. అలాగే ముడతలు కూడా తగ్గుతాయి. చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది.

ఇతర ప్రయోజనాలు..

1. దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

2. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.

3. జిడ్డు, పొడి చర్మం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది.

4. ఇది పవర్‌ఫుల్ డిటాక్సీఫైయర్ గా పని చేస్తుంది. టాక్సిన్స్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది.

5. ఎపిడెర్మిస్‌ను కాపాడుతుంది. మృదువైన, బొద్దుగా ఉండే చర్మాన్ని ఇస్తుంది.

6. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. పర్యావరణ కాలుషితాల నుంచి కాపాడుతుంది.

7. డయేరియా, జీర్ణ సమస్యలకు కూడా దానిమ్మ తొక్కల పొడి అద్భుతంగా పని చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..