Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easy Weight Loss Tips: కష్టపడకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ చూడండి..

ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, అధిక బరువు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Easy Weight Loss Tips: కష్టపడకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ చూడండి..
Weight Loss
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 08, 2022 | 10:56 AM

ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, అధిక బరువు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిట్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారనే విషయం తెలిసిందే. అందుకే స్థూలకాయం, అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు అనేక తిప్పలు పడుతుంటారు జనాలు. వ్యాయామం, రన్నింగ్, జిమ్‌లో కసరత్తులు చేయడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీముందుకు ఒక ఫిట్‌నెస్ సీక్రెట్ తీసుకువచ్చాం. ఇందులో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఈజీగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించడం ద్వారా కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? నిద్ర. అవును, అధిక బరువు, అనారోగ్య సమస్యల నివారణకు నిద్ర నే సరైన మందు అని చెబుతున్నారు. కంటికి సరిపడా నిద్రపోతే బరువు ఈజీగా తగ్గవచ్చునని చెబుతున్నారు.

నిద్ర ద్వారా బరువు తగ్గడం ఎలా?

  1.  నిద్రపోవడం వల్ల కూడా బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో కొన్ని అంశాలను జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
  2. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.
  3. ఎంత బిజీగా ఉన్నప్పటికీ 6 గంటల కంటే తక్కువ నిద్ర పోవద్దు. లేదంటే ఉదర సంబంధిత సమస్యలు పెరిగి, జీర్ణక్రియ దెబ్బతింటుంది.
  4. అదే సమయంలో 9 గంటలకు మించి నిద్ర పోకూడదు. ఇలా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
  5. సూర్యోదయానికి ముందే ఉదయం నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
  6. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవద్దు. పడుకునే 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
  7. రాత్రి భోజనం తరువాత కనీసం 30 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై నిద్ర బాగా వస్తుంది.

నిద్రపోతే బరువు తగ్గుతారా?

  1. తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది అని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. లేదా తగ్గుతుంది. దీంతోపాటు గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు, మూడ్ స్వింగ్ వంటి సమస్యలు వస్తాయి.
  2. రోజూ సరిపడా నిద్రపోయే వారితో పోలిస్తే 55 శాతం మేర స్థూలకాయం తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
  3. ధ్యానం కూడా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో నెగెటివ్ హార్మోన్ల ఉత్పత్తి జరుగదు. దీని వల్ల చురుకుగా, ఫిట్‌గా ఉంటారు.

గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టించుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..