- Telugu News Lifestyle Travel New year celebration 2023: these places are best for new year celebration you can visit with family and friends
New Year Party: కాక్ టైల్ లా కిక్ ఇచ్చే బెస్ట్ ప్లేసెస్.. న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడపడానికి బెస్ట్ ఎంపిక..
కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనడానికి సరికొత్తగా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పాలని భావిస్తుంటే.. దేశంలో ఈ ప్రదేశాలు నూతన సంవత్సర వేడుకలకు ఉత్తమమైనవి, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరుపుకోవడానికి ప్లాన్ చేయండి
Surya Kala | Edited By: Anil kumar poka
Updated on: Dec 12, 2022 | 3:14 PM

చాలా మంది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని విహారయాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఇక్కడ కొన్ని ప్రదేశాల గురించి మీకు ఈరోజు చెప్పనున్నాం. మీరు ఈ ప్రదేశాలలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవచ్చు.

సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా తక్కువ సమయం ఉంది. ప్రజలు కొత్త సంవత్సరానికి రకరకాలుగా వెల్కమ్ చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారా. మన దేశంలో కొన్ని ప్రదేశాలు బెస్ట్ ఎంపిక. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి మీరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.

గోవా - మీరు బీచ్‌లో గడపడానికి ఇష్టపడితే.. గోవా బెస్ట్ ఎంపిక. ఈ ప్రదేశం న్యూ ఇయర్ పార్టీకి సరైనది. మీరు ఇక్కడ బీచ్ పార్టీలో చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకలను రాత్రి జరుపుకోవడానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు.

శ్రీనగర్ - మీరు శ్రీనగర్ సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ దాల్ సరస్సులో బోటింగ్ ఆనందించవచ్చు. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో విహారయాత్ర కోసం ఇక్కడకు వెళ్లవచ్చు. మీరు దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హౌస్ బోట్, స్థానిక మార్కెట్‌లో కూడా సంతోషంగా గడపవచ్చు . కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇది గొప్ప ప్రదేశం.

లడఖ్ - లడఖ్ కూడా సందర్శించడానికి గొప్ప ప్రదేశం. చలికాలంలో ఈ ప్రదేశం అందం మరింతగా కనిపిస్తూ కనువిందు చేస్తోంది. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇది సరైన ప్రదేశం

మనాలి - మనాలి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నూతన సంవత్సరం సందర్భంగా మీరు ఇక్కడ హిమపాతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. మనాలి చాలా అందమైన ప్రదేశం. మీరు ఇక్కడ స్కీయింగ్ కూడా ఆనందించవచ్చు.





























