Hair Health: మన ఇంటన ఉండగా కరివేపాకు ఎందుకా విచారం.. జుట్టు సమస్యలన్నింటికీ ఒక్కటే సమాధానం.

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు పెరుగుతోన్న కాలుష్యం వెరసి జుట్టు సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నీటి కాలుష్యం కూడా దీనికి ఒక కారణంగా నిలుస్తోంది. చిన్న తనంలోనే జట్లు రాలడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి..

Hair Health: మన ఇంటన ఉండగా కరివేపాకు ఎందుకా విచారం.. జుట్టు సమస్యలన్నింటికీ ఒక్కటే సమాధానం.
Curry Leaves for healthy Hair
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 08, 2022 | 9:42 AM

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు పెరుగుతోన్న కాలుష్యం వెరసి జుట్టు సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నీటి కాలుష్యం కూడా దీనికి ఒక కారణంగా నిలుస్తోంది. చిన్న తనంలోనే జట్లు రాలడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో బట్టతల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రకరకాల షాంపూలను వాడుతూ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వీటివల్ల జరిగే మేలుతో పోల్చితే కొన్ని సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. అయితే సహజ సిద్ధంగా లభించే కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని మీకు తెలుసా.? కరివేపాకుతో ఆరోగ్యకరమైన వెంట్రుకలు ఎలా సొంతం చేసుకోవాలంటే..

వెంట్రుకలు తెల్లబడ్డ వారు కరివేపాకు వాడటం వల్ల జుట్టు నల్లబడుతుంది. ఇందులో కోసం కరివేపాకుతో నూనెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొన్ని తాజా కరివేపాకు ఆకులను తీసుకోవాలి. అనంతరం ఒక గిన్నె కొబ్బరి నూనె, సగం గిన్నె తరిగిన ఉల్లిపాయలను తీసుకుని బాణీలో వేడి చూయాలి. కరివేపాకు ఆకులు కూడా అందులో వేయాలి. అనంతరం నూనె మరిగిన తర్వాత వడకట్టి నూనెను చల్లార్చిన తర్వాత వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే చాలు. బలహీనంగా మారిన జుట్టు బలంగా తయారవుతుంది.

కరివేపాకు మాస్క్‌ ద్వారా కూడా వెంట్రుకలు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం కొన్ని కరివేపాకు ఆకులను తీసుకొని పేస్ట్‌లాగా నూరాలి. అనంతరం అందులో ఒక గిన్నె పెరుడు, రెండు చెంచాల తేనె కలపాలి. చివరిగా ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి 20 నిముషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడటం తగ్గి అందంగా ఒత్తుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..