Cauliflower side effects: కాలీఫ్లవర్ తింటున్నారా.? ఓసారి మీకు ఈ సమస్యలు ఉన్నాయేమో చూసుకోండి.
మార్కెట్‌కి వెళితే కచ్చితంగా వెంట తెచ్చుకునే వెజిటేబుల్స్‌లో కాలీఫ్లవర్ ఒకటి. తక్కువ ధరలో మంచి పోషకాలు లభిస్తాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కాలిఫ్లవర్ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందనడంలో..
మార్కెట్‌కి వెళితే కచ్చితంగా వెంట తెచ్చుకునే వెజిటేబుల్స్‌లో కాలీఫ్లవర్ ఒకటి. తక్కువ ధరలో మంచి పోషకాలు లభిస్తాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కాలిఫ్లవర్ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందనడంలో ఎంత నిజం ఉందో కొందరికి దీనివల్ల ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉందనడంలో అంతే నిజం ఉంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్‌కు కచ్చితంగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే సమస్యల బారిన పడిన వారు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలంటే..
* బీపీ లేదా రక్తం సంబంధిత సమస్యలతో బాధపడే వారు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాలీఫ్లవర్ తినడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. కాబట్టి వీరు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండడమే మంచిది.
* కీళ్ల నొప్పులు, వాపు, యూరిక్ యాసిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. దీని కారణంగా సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
* పాలిచ్చే తల్లులు కాలీఫ్లవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల పాలు తాగే పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
* గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణం కావు దీంతో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
* కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతోన్న వారు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. ఇందులో అధికంగా ఉండే క్యాల్షియం.. రాళ్ల సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది.
* థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా కాలీఫ్లవర్‌ను తినకూడదు. కాలీఫ్లవర్ టీ3, టీ4 అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..