Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ పాదాలలో జలదరింపు అనుభూతి కలుగుతోందా..? దానికి కారణాలేమిటంటే..

మానవ శరీరంలోని ప్రతి భాగానికి చేరే నరాలు మీ పాదాలతో అనుసంధానమై ఉంటాయి. ఆ కారణంగానే శరీర ఆరోగ్యంలో పాదాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసందర్భాలలో మీ శరీరం..

Health Tips: మీ పాదాలలో జలదరింపు అనుభూతి కలుగుతోందా..? దానికి కారణాలేమిటంటే..
Foot Tingling
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 07, 2022 | 9:26 PM

మానవ శరీరంలోని ప్రతి భాగానికి చేరే నరాలు మీ పాదాలతో అనుసంధానమై ఉంటాయి. ఆ కారణంగానే శరీర ఆరోగ్యంలో పాదాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసందర్భాలలో మీ శరీరం విటమిన్ల లోపానికి గురికావచ్చు. అలాంటి సమయంలో మీ పాదాలు జలదరింపులకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే  ఇది పెద్ద సమస్య కానప్పటికీ తాత్కాలికంగా కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని రకాల చిట్కాలను అనుసరిస్తే సరి.. సమస్య పరిష్కారమయినట్టే..

భారతీయ ప్రసిద్ధ పోషకాహార నిపుణుడు నయోమీ అగర్వాల్ ప్రకారం.. మీ శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లేకపోవడం వల్ల పాదాలు జలదరించే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే అదే కాకుండా మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే..

1) విటమిన్ B12: మానవ శరీరంలో ప్రతీ భాగంతోనూ నాడీ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. నాడీ వ్యవస్థ నరాల సహకారంతోనే పనిచేస్తుంది. నరాల సరైన పనితీరుకు విటమిన్ B12 అవసరం. శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడితే నరాలు బలహీనమవుతాయి ఫలితంగా పాదాలలో జలదరింపు అనుభూతి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

2) విటమిన్ B6: విటమిన్ బి6 నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది నరాలను ఉత్తేజపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ శరీరంలో విటమిన్ బి6 తగ్గకుండా చూసుకోండి.

3) థైరాయిడ్ చెకప్: పాదంలో జలదరింపు ఏర్పడడానికి థైరాయిడ్ చెకప్ కూడా ఒక కారణమని గమనించాలి.

4) చక్కెర స్థాయి: మానవ శరీరంలోని చక్కెర స్థాయి కూడా ఈ పరిస్థితికి కారణమవుతాయి. చక్కెర స్థాయిలోని హెచ్చుతగ్గులు మీ నాడీ వ్యవస్థను, ముఖ్యంగా మీ కాళ్ళు, పాదాలను ప్రభావితం చేస్తాయి. అధిక చక్కెర స్థాయిలు జిట్టర్లకు కారణమవుతాయి.

5) డీహైడ్రేషన్: డీహైడ్రేషన్ (డీహైడ్రేషన్) అనేది శరీరంలో సరి పడినంత నీరు లేకపోవడం వల్ల ఏర్పడే స్థితి. మానవ శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు అది రోజువారీ కార్యకలాపాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేషన్ సోడియం స్థాయి పడిపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా ఇది జలదరింపు అనుభూతికి దారితీస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..