AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మూడు సింహాలతో ఓ అమ్మాయి.. వీడియో చూశారంటే షాక్ అవ్వాల్సిందే..

మనం జీవించే ఈ సువిశాల ప్రపంచంలో మనకు తెలిసిన వేలాది జాతుల జంతువులు ఉన్నాయి. ఇంకా వాటితో పాటు మనకు తెలియని జాతులు కూడా ఉండి ఉండవచ్చు. కానీ వాటిలో కొన్ని జంతువులను..

Viral Video: మూడు సింహాలతో ఓ అమ్మాయి.. వీడియో చూశారంటే షాక్ అవ్వాల్సిందే..
Viral Video Of 3 Lines
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 07, 2022 | 7:19 PM

Share

మనం జీవించే ఈ సువిశాల ప్రపంచంలో మనకు తెలిసిన వేలాది జాతుల జంతువులు ఉన్నాయి. ఇంకా వాటితో పాటు మనకు తెలియని జాతులు కూడా ఉండి ఉండవచ్చు. కానీ వాటిలో కొన్ని జంతువులను మాత్రమే మన చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తాం. అలాంటి క్రూర మృగాలలో అన్నింటి కంటే ముందుగా ఉండేది సింహమే అని మనందరికీ తెలుసు. మనకు తెలిసిన విషయమే అయినా ఇవి ప్రపంచంలోని వన్య మృగాలలో కెల్లా అత్యంత ప్రమాదకరమైనవి, క్రూరమైనవి కూడా. వాటి బారిన పడి చిక్కుకోవడం అంటే మన జీవితాన్ని కోల్పోవడమే. అందుకే అడవిలోని జంతువులన్నీ కూడా సింహాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాయి. సింహాలను జంగిల్ సఫారీలలో, మూసి ఉన్న బోనుల్లో మీరు తప్పక చూసే ఉంటారు.

అయితే ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి వైరల్ కావడమే కాదు..  చూసినవారినందరినీ షాక్‌కు గురిచేస్తుంది కూడా. వైరల్ అవుతున్ ఆ వీడియోలో ఒక అమ్మాయి ఒంటరిగానే ఏకకాలంలో క్రూరమైన మూడు సింహాలతో కలిసి నడుస్తూ వస్తుండడం కనిపింస్తుంది. ఆమె వెనుక నడుస్తుంటే.. ఆ మూడు సింహాలు తన ముందు ఒకే సరళరేఖలో నడుస్తూ ఉంటాయి. ఇది ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు. సాధారణంగా సింహాలు ఒక మనిషిని చూడగానే దాడి చేసి చంపేస్తాయి. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నమైన సంఘటన. మీరు ఎప్పుడైనా సింహం వద్దకు వెళ్లడానికి ధైర్యం చేస్తారా..? ఖచ్చితంగా మీ సమాధానం ‘నో…నెవర్’ అనే ఉంటుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మూడు సింహాలు పెంపుడు జంతువుగా ఉంటే అనే ఆలోచన మీలో కలుగుతోంది కదా..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..

View this post on Instagram

A post shared by Jen (@girlfromparadise9)

బహుశా అందుకే ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని గర్ల్‌ఫ్రంపారడైజ్9 అనే ఖాతాదారు షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 6.8 లక్షల మంది వీక్షించగా.. 3.2 లక్షల మంది లైక్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడడమే కాక తమ తమ అభిప్రాయలను కామెంట్ కూడా చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ నెటిజన్  ‘మూడు సింహాలు ఆ మహిళవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం.. ఆమెపై దాడి చేయకపోవడం విడ్డూరమన్నా’రు. మరో నెటిజన్ ‘ఈ మూడు సింహాలకు ఆ అమ్మాయి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే అవి ఆమెను తమతో నడవడానికి అనుమతించాయి’ అని రాసుకొచ్చారు. అయితే చాలా మంది వినియోగదారులు ఆ అమ్మాయిని ధైర్యవంతురాలుగా అభివర్ణించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..