- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu and Namrata Shirodkar enjoy meal with team SSMB 28 in Mumbai
‘SSMB 28’ టీమ్‌తో కలిసి భోజనం చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు..
నటుడు మహేష్ బాబు సినిమా పనుల్లోకి తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రుల మరణానంతరం కాస్త డిప్రెషన్‌లో ఉన్న మహేష్ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు..
Updated on: Dec 07, 2022 | 8:20 PM

నటుడు మహేష్ బాబు సినిమా పనుల్లోకి తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రుల మరణానంతరం కాస్త డిప్రెషన్‌లో ఉన్న మహేష్ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

మహేష్ బాబు 28వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పనులు ఆలస్యమయినప్పటికీ ఇప్పుడు పనులన్నీ వేగవంతమయ్యాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'SSMB 28' సినిమా రానుంది. ఈ మేరకు ముంబైలో ఈ సినిమా టీమ్ సభ్యులతో మహేష్ బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కూడా హాజరయ్యారు.

'SSMB 28' సినిమా టీమ్ అందరితో కలిసి మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ విందును ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

త్వరలో మహేష్ బాబు, నమ్రత కలిసి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారని కొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
