- Telugu News Photo Gallery Cinema photos Priyanka chopra shocking comments on heroines remuneration in bollywood
Priyanka Chopra: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియాంక.. అంతమాట అనేసిందేంటబ్బా..!!
ఇటీవలే ఈ అమ్మడు ఇండియాకు వచ్చింది. ప్రియాంక చోప్రా కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేయాలనీ చూస్తుందట ఇందుకోసమే ప్రియాంక ఇండియాకు వచ్చిందని అంటున్నారు.
Updated on: Dec 07, 2022 | 9:08 PM

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసిన గ్లోబల్ స్టార్ గా ఎదిగింది.

ఆ తర్వాత నిక్ జోనస్ ను పెళ్ళాడి విదేశాలకు చెక్కేసింది. ప్రియాంక ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.అయితే దాదాపు మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

ఇటీవలే ఈ అమ్మడు ఇండియాకు వచ్చింది. ప్రియాంక చోప్రా కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేయాలనీ చూస్తుందట ఇందుకోసమే ప్రియాంక ఇండియాకు వచ్చిందని అంటున్నారు.

తాజాగా హీరోయిన్ల పారితోషికాలపై ప్రియాంక మాట్లాడుతూ .. కెరీర్ ఆరంభంలో హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే కేవలం 10 శాతమే తనకు చెల్లించినట్టు పేర్కొంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో నాకు సమానంగా ఎప్పుడూ చెల్లించలేదు. తోటి మేల్ ఆర్టిస్ట్ లతో పోల్చుకుంటే నాకు 10 శాతమే చెల్లించే వారు.

చాలా మంది మహిళా నటులు ఇప్పటికీ దీన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను ఇప్పుడు బాలీవుడ్ లో నటించినా నాకు కూడా ఇదే విధంగా చెల్లిస్తారు అని తెలిపింది.

అలాగే సెట్లో గంటల తరబడి కుర్చునేవాళ్ళం.. కానీ మగాళ్లు మాత్రం స్వేచ్ఛగా వ్యవహరించేవారు. ఇష్టమొచ్చినప్పుడు షూటింగ్ కు వచ్చే వారు అంటూ చెప్పుకొచ్చింది.
