AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acne and Pimples: మీరు మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ విధంగా వాటికి పరిష్కరించుకోండి..

బాల్యం నుంచి కౌమరదశకు ప్రవేశించిన యువతీయువకుల శరీరంలో అనేక మార్పులు జరగడం సహజం. అయితే ఈ మార్పుల వల్ల వారు చాలా ఇబ్బందులు కూాడా పడతారు. అలాంటి ఇబ్బందులలో మొటిమలు, బ్లాక్‌హెడ్స్, ముఖం మీద మచ్చలు..

Acne and Pimples: మీరు మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ విధంగా వాటికి పరిష్కరించుకోండి..
Pimples In Teenage
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 07, 2022 | 4:45 PM

Share

బాల్యం నుంచి కౌమరదశకు ప్రవేశించిన యువతీయువకుల శరీరంలో అనేక మార్పులు జరగడం సహజం. అయితే ఈ మార్పుల వల్ల వారు చాలా ఇబ్బందులు కూాడా పడతారు. అలాంటి ఇబ్బందులలో మొటిమలు, బ్లాక్‌హెడ్స్, ముఖం మీద మచ్చలు ప్రధానమైనవి. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో అనేక హార్మోన్లు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ హార్మోన్ల కారణంగానే శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఈ మార్పులలో భాగమే ముఖంపై వచ్చు మొటిమలు, మచ్చలు. అయితే ఈ మొటిమలు, మచ్చల కారణంగా మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇంకా వీటి కారణంగానే మన చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా కనిపించడం కూడా ప్రారంభమవుతుంది.

ఇక ఆ మొటిమలను, మచ్చలను వదిలించుకోవడానికి మనం ఎన్నో రకాల కాస్మొటిక్స్‌ను కూడా వాడే ఉంటాం. అయితే అదే క్రమంలో మన చర్మాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. మరి టీనేజ్‌లో స్కిన్‌కేర్‌ను ఎలా పాటించాలో తెలుసుకుందాం..

క్లెన్సర్..

మొటిమలు రాకుండా ఉంచడానికి మీ చర్మాన్ని క్రమం తప్పకుండా శుభ్రంగా కడగాలి. మీకు పొడి చర్మం ఉంటే క్రీమ్ బేస్ క్లెన్సర్ ఉపయోగించండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌ను ఉపయోగించండి. ఇంకా మీరు మేకప్ వేసుకుంటుంటే దానిని పూర్తిగా తొలగించండి. అలా చేయకపోతే మీ చర్మం డల్ గా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

టోనర్..

టీనేజ్ చర్మంలో అదనపు సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి టోనర్ ఉపయోగించండి. ఇది చర్మం యొక్క pH స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని కూడా శుభ్రపరుస్తుంది. మీరు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

మాయిశ్చరైజర్..

మీ ముఖం, శరీరానికి మాయిశ్చరైజర్‌ను తప్పకుండా ఉపయోగించుకోండి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడమే కాక మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఇంకా చర్మపు చికాకు నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం వల్ల మీ చర్మం నిర్జీవంగా, డల్‌గా కనిపించదు. మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, ముఖంపై తేలికగా మాయిశ్చరైజర్ రాయండి. ఒకవేళ మీదిపొడి చర్మం అయితే రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

సన్స్క్రీన్..

స్కిన్ కేర్‌కు సన్‌స్క్రీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్‌ని చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడల్లా సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల ఇది మీ చర్మాన్ని వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. ఇంకా మీ చర్మాన్ని టానింగ్ నుంచి కూడా రక్షిస్తుంది. దీనితో పాటు ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

లిప్ బామ్..

లిప్ బామ్ మీ పెదాలకు పోషణను అందిస్తుంది. దీని కోసం పెదవులకు క్రమం తప్పకుండా లిప్ బామ్ ఉపయోగించండి. మీ పెదాలను హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా వాటిని మృదువుగా కూడా ఉంచుతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి