Breakfast Tips: అల్పాహారంగా ఈ ఏడు పదార్థాలను తినడం వల్ల ఎన్ని సమస్యలో.. తెలుసుకుందాం రండి..
మనషి రోజువారీ ఆహారంలో అల్పాహారం అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే మీరు రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇంకా మంచి పోషక విలువలున్న అల్పాహారాన్ని మీరు తిన్నట్లయితే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా..
మనషి రోజువారీ ఆహారంలో అల్పాహారం అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే మీరు రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇంకా మంచి పోషక విలువలున్న అల్పాహారాన్ని మీరు తిన్నట్లయితే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంకా అవి మీకు చాలా శక్తినిస్తాయి. కానీ తొందరపడి అల్పాహారంగా ఏదిపడితే అది తినడం మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇంకా అవి అనేక దుష్ప్రభావాలను కూడా చూపిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్పాహారంలో నుంచి కొన్ని రకాల ఆహారపదార్థాలను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. అటువంటి ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం..
పుల్లని పండ్లు..
ఉదయం పూట పుల్లని పండ్లకు దూరంగా ఉండడం మన ఆరోగ్యానికి చాలా మేలు. ముఖ్యంగా నారింజ వంటి కాలానుగుణ పండ్లను ఉదయం పూట అసలు తినకూడదు. అల్పాహారంగా పుల్లని పండ్లను తినడం వల్ల కడుపులో ఏసిడిటీ ఏర్పడుతుంది. ఫలితంగా ఇది గ్యాస్, గుండెల్లో మంట ,ఉబ్బరానికి దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో టీ, కాఫీలు..
ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వెంటనే మానుకోండి. ఖాళీ కడుపుతో తాగడం మీ జీర్ణవ్యవస్థకు హానికరం ఇంకా అలా చేయడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ప్యాకెట్ జ్యూస్..
అల్పాహారం కోసం ప్యాక్ చేసిన జ్యూస్‌లను తీసుకోవడం మానుకోవడం మంచిది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదమే కాక ఇది ఊబకాయాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఉదయాన్నే ప్యాక్ చేసిన జ్యూస్‌లను తీసుకోవడం ఆపేయండి.
అరటిపండు..
అరటిపండ్లు చాలా ఆరోగ్యకరమైనవి ఇంకా రుచికరమైనవి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తీసుకోవడం వల్ల రక్తంలోని ఈ రెండు ఖనిజాల అసమతుల్యతకు లోనవుతాయి. ఇది శరీరానికి హానికరం.
పెరుగు..
పెరుగులో ఉండే బ్యాక్టీరియా వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం మాత్రమే పెరుగును తినాలి. ఉదయాన్నే పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, కడుపు నొప్పి, అసిడిటీ వంటి అనేక ఇతర సమస్యలు వస్తాయి.
తియ్యనివి..
అల్పాహారం కోసం తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే స్వీట్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో తీపి పదార్థాలను చేర్చకండి.
బ్రెడ్, జామ్..
చాలా మంది అల్పాహారం కోసం బ్రెడ్, జామ్ తింటారు. ఇందులో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటికి బదులుగా మీరు గుడ్లను తినవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి