ఆ దేశ మాజీ అధ్యక్షుడికి పిడిగుద్దులు.. కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా అకస్మాత్తుగా దూసుకొచ్చి.. షాకింగ్ వీడియో
ఆయన ఓ దేశానికి మాజీ అధ్యక్షుడు.. ఫుల్ సెక్యూరిటీ.. అయినా ఓ వ్యక్తి అతని దగ్గరికొచ్చి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు.. ఈ షాకింగ్ ఘటన అల్బేనియన్ దేశంలో చోటుచేసుకుంది.
ఆయన ఓ దేశానికి మాజీ అధ్యక్షుడు.. ఫుల్ సెక్యూరిటీ.. అయినా ఓ వ్యక్తి అతని దగ్గరికొచ్చి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు.. ఈ షాకింగ్ ఘటన అల్బేనియన్ దేశంలో చోటుచేసుకుంది. అల్బేనియన్ మాజీ అధ్యక్షుడు 78 ఏళ్ల సాలి బెరిషా పై ఓ వ్యక్తి దాడి చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. బుధవారం అల్బేనియన్ రాజధాని టిరానాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బెరిషాకు చేదు అనుభవం ఎదురైంది. నిరసనల్లో పాల్గొన్న వందలాది మధ్య.. ఉన్న బెరిషా దగ్గరికి ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చాడు. అనంతరం అతనిపై దాడి చేశాడు. టిరానాలో EU-బాల్కన్స్ సమ్మిట్ కు ముందు అక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసన నిర్వహించారు. ఈ నిరసనలో ప్రతిపక్ష నాయకుడు బెరిషా పాల్గొన్నారు. నిరసనకారుల్లోని 30 ఏళ్ల వ్యక్తి మాజీ అధ్యక్షుడిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాజీ అధ్యక్షుడిపై దాడి వెంటనే.. అక్కడున్న సిబ్బంది, అనుచరులు అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో బెరిషా కంటి కింద స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం 31 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతను మానసికంగా బాధపడుతున్నాడని, గతంలో హింసాత్మక ఘర్షణలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
Former Albanian president, Sali Berisha, 78, is punched in the face and left with a black eye as thug attacks him during anti-govt protest pic.twitter.com/VcJA72jtpM
— SNOW TV® ??? RC 3662284 (@OfficialSnowtv) December 6, 2022
అల్బేనియా EU-బాల్కన్స్ సమ్మిట్‌ను నిర్వహించింది. దీనికి నాయకులు ఐరోపా నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి ప్రతిపక్షాలు ప్రస్తుత ప్రధాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అవినీతి ఆరోపణల కారణంగా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం సాలి బెరిషా ప్రధాని ఈడీ రామపై విమర్శలు గుప్పించారు. పోలీసులతో ప్రేరేపించిన నేరపూరిత చర్య అంటూ ప్రధాని పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. ప్రధానమంత్రి ఈడి రామ ఈ ఘటనను ఖండించి.. హింస మంచిది కాదంటూ సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..