AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలకు దూరంగా ఉండానుకుంటున్నారా..? అయితే ఈ ఐదు పదార్థాలను మీ ఆహారంలోకి చేర్చుకోండి..

కనీసం ఒక్క బిడ్డకు అయినా జన్మనివ్వాలనేది ప్రతి స్త్రీకి ఉండే సహజమైన కల. అయితే దురదృష్టవశాత్తు కొందరు మహిళలకు ఆ భాగ్యం ఉండదు. అందుకు..

Women Health: ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలకు దూరంగా ఉండానుకుంటున్నారా..? అయితే ఈ ఐదు పదార్థాలను మీ ఆహారంలోకి చేర్చుకోండి..
Women Reproductive System
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 07, 2022 | 8:55 PM

Share

కనీసం ఒక్క బిడ్డకు అయినా జన్మనివ్వాలనేది ప్రతి స్త్రీకి ఉండే సహజమైన కల. అయితే దురదృష్టవశాత్తు కొందరు మహిళలకు ఆ భాగ్యం ఉండదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది మహిళల ఆరోగ్యం. కొందరు పుట్టుకతోనే అండాశయ లోపాలతో జన్మిస్తారు. ఆ కారణంగా వారు తల్లి కాలేరు. మరి కొందరు జన్యుపరమైన లోపాల కారణంగా గర్భం దాల్చలేరు. అయితే చాలా ఎక్కువ మంది మాత్రం తమ ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం కారణంగా తమ నుదిటి రాతను తామే తుడిచేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా వారు తల్లి అయ్యే భాగ్యాన్ని తెలిసీతెలియక చేతులారా తుడిచేసుకుంటారు.

అందువల్ల ప్రత్యుత్పత్తి సమస్యలకు దూరంగా ఉండాలనుకునేవారికి వైద్య నిపుణులు పలు రకాల సలహాలు ఇస్తున్నారు. స్త్రీ  ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సహాయపడే 5 ప్రత్యేక ఆహారాల గురించిన సమాచారాన్ని వారు అందించారు .అవేమిటంటే..

1. తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, వోట్స్ వంటి తృణధాన్యాలలో జింక్, సెలీనియం, B విటమిన్లు వంటి సంతానోత్పత్తిని పెంచే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్త్రీ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. స్వీట్లు, కేకులు,పేస్ట్రీలు వంటి ఉత్పత్తులలో శుద్ధి చేసిన చక్కెరలు కలుపుతారు. వీటిని తీసుకోవడం వల్ల స్త్రీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రకం ఉత్పత్తులను తగ్గించాలి.

ఇవి కూడా చదవండి

2. గుడ్డు: గుడ్లు విటమిన్లకు, ప్రోటీన్లకు నిలయం వంటివి. ఒమేగా 3, కోలిన్ కంటెంట్‌ను కూడా గుడ్లు కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల గర్భాశయానికి సంబంధించిన ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

3. చేప: చేపలలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సహాయపడటమే కాకుండా, పొడి చర్మం, పొడి జుట్టు, అలసట, చిరాకు, కీళ్లనొప్పులు, అధిక రక్తపోటు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

4. బెర్రీలు: గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు బెర్రీలు అద్భుతంగా సహకరిస్తాయి. బెర్రీలలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియెంట్స్, రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్ స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. స్త్రీ శరీరంలో పిండాభివృద్ధి జరగడానికి అవసరమైన ఫోలేట్, విటమిన్ సీ వంటి పోషకాలను బెర్రీలు కలిగి ఉన్నందున అవి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఉపయోగపడతాయి. బెర్రీలు బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.

5. పెరుగు: జీర్ణ రుగ్మతలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో పెరుగు సహాయపడుతుంది. అదనంగా కడుపు పూతల, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగు తగ్గిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నించే ప్రతి స్త్రీ క్రమం తప్పకుండా కాల్షియం పోషకాలతో నిండిన పండ్లు లేదా పండ్ల గింజలతో  ఒక కప్పు పెరుగు తినాలి.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి