Coconut Water: చలికాలం కదా అని నీళ్లను తక్కువగా తాగుతున్నారా..? మరి డీహైడ్రేట్ అవకుండా ఏం చేయాలంటే..

మీరు చలికాలంలో నీరు తాగే విషయంలో కొంత ఉదాసీనంగా ఉండవచ్చు. ఆ కారణంగా మీరు తక్కువగా నీటిని తీసుకున్నట్లయితే.. క్రమం తప్పకుండా కొబ్బరినీళ్లు తాగండి. చలికాలంలో..

Coconut Water: చలికాలం కదా అని నీళ్లను తక్కువగా తాగుతున్నారా..? మరి డీహైడ్రేట్ అవకుండా ఏం చేయాలంటే..
Coconut Water
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 07, 2022 | 9:48 PM

మీరు చలికాలంలో నీరు తాగే విషయంలో కొంత ఉదాసీనంగా ఉండవచ్చు. ఆ కారణంగా మీరు తక్కువగా నీటిని తీసుకున్నట్లయితే.. క్రమం తప్పకుండా కొబ్బరినీళ్లు తాగండి. చలికాలంలో సహజంగానే దాహం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నీరే తాగుతాం. కానీ తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం, మంటలు, ఎర్రబడడం వంటివి జరుగుతాయి. అందువల్ల తగినంతగా మంచినీటిని తాగండి. నీళ్ల పట్ల ఉదాసీన భావం ఉంటే దానికి బదులుగా కొబ్బరినీళ్లను తాగండి.

కొబ్బరినీళ్లు చాలా సురక్షితమైన, కల్తీ లేని పానీయం. కొబ్బరి నీరు మన ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వల్ల మన శరీరంలోని అనేక రకాల టాక్సిన్స్ తొలగిపోతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుదల: కొబ్బరినీళ్లను తాగడం వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక కొబ్బరికాయలోని నీటిలో సుమారు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. అవును, అది నిజమే.. కానీ కొబ్బరి నీళ్లు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

బ్లడ్ ప్రెషర్ కంట్రోల్: కొబ్బరి నీళ్ళు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల మన రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణం స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది.

గుండె: కొబ్బరి నీరు మన శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలకు కొంతమేర దూరంగా ఉండవచ్చు.

ఆరోగ్యవంతమైన జీర్ణక్రియ: కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల మానవ శరీరంలోని జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.  ఇంకా ఈ నీళ్లను తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, గుండెల్లో మంట, పేగు వాపు, అల్సర్ల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మరింతగా మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!