AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒక్కొక్కడు ఒక్కోరకంగా ఉన్నార్రా బాబూ.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..

Hyderabad Drunk and Drive: మద్యం సేవించడం హానికరం.. మందు తాగి వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదం.. మందుతాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు.. ఇలా స్లోగన్స్ ఎన్ని చెప్పినా మందు బాబులు మాత్రం ‘వుయ్ డోంట్ కేర్’ అంటున్నారు.

Watch Video: ఒక్కొక్కడు ఒక్కోరకంగా ఉన్నార్రా బాబూ.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..
Drunk And Drive
Shiva Prajapati
|

Updated on: Dec 09, 2022 | 1:22 PM

Share

మద్యం సేవించడం హానికరం.. మందు తాగి వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదం.. మందుతాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు.. ఇలా స్లోగన్స్ ఎన్ని చెప్పినా మందు బాబులు మాత్రం ‘వుయ్ డోంట్ కేర్’ అంటున్నారు. పోలీసులు పట్టుకుంటారా? పట్టుకోనియ్ అని మరింత రెచ్చిపోతున్నారు. అంతేకాదు మద్యం మత్తులో మందుబాబులు చేసే రచ్చ పోలీసులకు మరింత తలనొప్పిగా పరిణమిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులు రకరకాల ఫీట్లు, చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ రివర్స్‌గా పోలీసులపైనే అబండాలు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

చంపాపేట్ మనసా గార్డెన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో మందు బాబుల వ్యవహారం ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. చంపా పేట ప్రధాన రహదారి పై మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ తనిఖీ లలో మందుబాబులు వీరంగం చేశారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే పోలీసులతో చిత్ర విచిత్రంగా వ్యవహరించారు. రోడ్డుపై తనిఖీలను చూసి కొందరు తమ వాహనాలను వదిలి పారిపోయారు. మరి కొందరు వాహనాలతో పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లారు. వారిని వెంబడించి పట్టుకుని తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక పట్టుబడ్డ కొందరైతే తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీస్తూ.. ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులపై ఆబండాలు వేస్తున్నారు. ఇలా మందుబాబులు పోలీసులకు చుక్కలు పరిపాటిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..