Hyderabad: చూడటానికి అది పక్కా చాక్లెట్టే.. చప్పరిస్తే గానీ తెలిసింది దాని అసలు గుట్టు..

Hyderabad Ganja Chocolate: చాక్లెట్లు తినమని ఇస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది. తియ్యగా, టేస్టీగా ఉండే ఈ చాక్లెట్లను పిల్లలు మొదలు పెద్దల వరకు లొట్టలేసుకుంటూ చప్పరిస్తారు. అయితే, చాక్లెట్లందు ఈ చాక్లెట్లు పూర్తిగా వేరు.

Hyderabad: చూడటానికి అది పక్కా చాక్లెట్టే.. చప్పరిస్తే గానీ తెలిసింది దాని అసలు గుట్టు..
Ganja Chocolate
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 09, 2022 | 1:50 PM

చాక్లెట్లు తినమని ఇస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది. తియ్యగా, టేస్టీగా ఉండే ఈ చాక్లెట్లను పిల్లలు మొదలు పెద్దల వరకు లొట్టలేసుకుంటూ చప్పరిస్తారు. అయితే, చాక్లెట్లందు ఈ చాక్లెట్లు పూర్తిగా వేరు. వీటి టేస్ట్ కూడా ఇంకా ఇంకా వేరు. అవును, మరి.. అవి చూడటానికే చాక్టెట్లు.. తింటే కథ వేరే ఉంటుంది. ఏ మందు ఇవ్వని కిక్కు ఆ చాక్లెట్లు ఇస్తాయి. ఒక్క చాక్లెట్ తింటే స్వర్గంలో విహరించినట్లుగా అనిపిస్తుంది. చాక్లెట్ తింటే అలా ఎందుకు అవుతుందని సందేహిస్తున్నారా? అయితే, ఈ సందేహానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం.

అవును మరి, ఆ చాక్లెట్ అట్టాంటిట్టాంటి చాక్లెట్ కాదు. పూర్తిగా గంజాయితో తయారు చేసిన చాక్లెట్. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లు తయారు చేస్తూ విక్రయిస్తోంది ఓ ముఠా. తాజాగా ఆ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. పటాన్‌చెరులో గంజాయి చాక్లెట్ల ఫ్యాక్టరీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. చార్మినార్ గోల్డ్ మునాఖ్చా పేరుతో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 20 రూపాయలకు ఒక్కో గంజాయి చాక్లెట్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఆ గంజాయి చాక్లెట్ల ఫ్యాక్టరీపై దాడులు చేశారు పోలీసులు. ఒడిషాకు చెందిన అనిమేష్, రంజిత, బాజ్ర మోహన్‌ లను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులకు చెందిన షాపుల్లో 271 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

చిలుకూరులో దొంగల బీభత్సం..

ఇదిలాఉంటే.. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిలుకూరులో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఒక్కొక్కరి ఇండ్లలో 4 సెల్ ఫోన్లు, డబ్బులు, మోటర్లు ఎత్తుకెళ్లారు. అయితే, ఓ మహిళ మెడలో నుండి గోల్డ్ చైన్ లాగుతుండగా దొంగల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగతా వారు పారిపోయారు. పట్టుబడిన దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. ఈ ఘటనతో గ్రామస్తులంతా భయంతో అల్లాడిపోతున్నారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి ఇలా తయారవుతున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ దొంగతనం చేసిన వారు చిలుకూరు గ్రామానికి చెందిన వారే అని గుర్తించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అధికారులను వేడుకున్నారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు