Wonder: స్మశానంలో తవ్వకాలు.. తళుక్కుమన్న వింత వస్తువు.. తీసి చూస్తే మైండ్ బ్లోయింగ్..
Ancient Necklace: తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరకడం, విలువైన వస్తువులు దొరకడానికి సంబంధించి మనం నిత్యం ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త మాత్రం అంతకు మించి అనాల్సిందే.
తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరకడం, విలువైన వస్తువులు దొరకడానికి సంబంధించి మనం నిత్యం ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త మాత్రం అంతకు మించి అనాల్సిందే. అవును, స్మశాన వాటికలో మరమ్మతుల నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా.. ఉహించని, అత్యంత ప్రాచీనమైన, అత్యంత విలువైన ఆభరణం ఒకటి లభ్యమైంది. దాదాపు 1300 ఏళ్ల క్రితం నాటిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఇంగ్లండ్‌లో బయటపడింది. సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా ఆంగ్లో-సాక్సన్ స్మశాన వాటికలో పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అత్యంత విలువైన, బంగారం, రత్నాలతో చేసిన ఆభరణం బయటపడింది. మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ ప్రకారం.. ఇది బ్రిటన్‌కు చెందిన ఉన్నత మహిళకు సంబంధించిన ఆభరణంగా పేర్కొన్నారు. క్రీ.శ 630-670 కి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
బ్రిటన్‌లో ఇప్పటి వరకు బయటపడిన పురాతన వస్తువుల్లో ఇదే అత్యంత విలువైనదిగా పేర్కొంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. స్మశాన వాటిక తవ్వకాల్లో బయటపడిన ఈ బంగారంతో చేసిన నెక్లెస్‌లో రోమన్ నాణేలు, గోమెదికం, విలువైన రంగు రాళ్లు, రత్నాలు సహా 30 పెండెంట్లు ఉన్నాయి. దీనిని నార్తాంప్టన్ సమీపంలో కనిపెట్టారు. చూడటానికి ఎంతో స్పెషల్‌గా ఉన్న ఈ హారం.. అత్యంత విలువైనదని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తవ్వకాల్లో రెండు డిజైనర్ పాత్రలు, ఒక రాగి పాత్ర కూడా లభించిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తవ్వకాల్లో లభ్యమైన ఆభరణం ఒక క్రైస్తవ నాయకురాలికి చెందినదని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
తవ్వకాల్లో లభ్యమైన పురాతన నక్లెస్..
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..