Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్ట్‌ను సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక వేతనం 170 వేల డాలర్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ వివరాల్ని ఆడమ్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఎలుకలంటే తనకు అసహ్యమని ఆడమ్స్ పేర్కొన్నారు. ‘న్యూయార్క్ నగరంలో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా? మీరు ఎలుకలను చాకచక్యంగా పట్టుకోగలరా? అయితే మీ కలల ఉద్యోగం రెడీగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు మేయర్ ఆఫీస్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ఉద్యోగాన్ని ‘చిట్టెలుక ఉపశమన డైరెక్టర్’ డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ అని పిలుస్తారని, ఏడాదికి కోటి 38 లక్షల 55 వేల రూపాయల వేతనం ఉంటుందని పేర్కొంది. అభ్యర్థికి నాయకత్వ లక్షణాలు, సత్తువ, ఎలుకలను పట్టుకొనే సామర్థ్యంలాంటి అర్హతలు ఉండాలని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 09, 2022 09:25 PM
వైరల్ వీడియోలు
Latest Videos