Viral Video: పోలీసులు ఫైనులు వేయడమే కాదు.. పాటలు పాడతారు.. తమిళ సాంగ్‌తో దుమ్మురేపిన కేరళ కానిస్టేబుల్..
సోషల్ మీడియా వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్‌ను వేగవంతంగా ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. పోలీసులు కూడా ఇటీవల కాలంలో పోలీసులు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడానికి, ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడానికి సామాజిక..
సోషల్ మీడియా వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్‌ను వేగవంతంగా ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. పోలీసులు కూడా ఇటీవల కాలంలో పోలీసులు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడానికి, ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడానికి సామాజిక మాద్యమాలను ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరాల బారినపడి మోసపోకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కొన్నిసందర్భాల్లో పోలీసులు తమలోని కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కేరళకు చెందిన ఓ పోలీసులు కానిస్టేబుల్ ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్టు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పోలీసు కానిస్టేబుల్ పాటను పాడుతూ తన తోటి సిబ్బందిని ఉత్సహపరుస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న సహచర సిబ్బంది తన పాటను ఫోన్‌లో రికార్డు చేశారు. సాధారణంగా పోలీసులు తమ విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉంటారు. పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటల డ్యూటీ. శాంతిభద్రతలు కాపాడటంలో వారిదే కీలకపాత్ర.. విధుల్లో బిజీగా ఉంటూనే కొన్నిసార్లు వాళ్లలో టాలెంట్‌ను బయటపెడుతూ ఉంటారు. కేరళ పోలీసు పాడిన పాట నెట్టింట్లో అందరి ప్రశంసలు అందుకుంటోంది.
పోలీసు కానిస్టేబుల్ కాసేపు తన విధి నిర్వహణకు విరామం ఇచ్చి.. తన పాటతో సహోద్యోగులను అలరించాడంటూ ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తమిళచిత్రం సిల్లును ఓరు కాదల్‌లోని మున్బే వా అనే పాటను పాడుతూ కనిపించాడు . సూర్య, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రంలోని ఈ పాటను శ్రేయా ఘోషల్, నరేష్ అయ్యర్ పాడారు.
ట్విట్టర్‌లో రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. అనేకమంది వీడియోను లైక్ చేయడంతో పాటు..రకరకాల కామెంట్లు పెట్టారు. మనిషి యొక్క అందమైన స్వరాన్ని ప్రశంసించకుండా ఉండలేమని కొందరు, సూపర్ అని మరికొందరు చాలా మంచి వాయిస్ అంటూ ఇంకొందరు తమ కామెంట్స్ పోస్టు చేశారు.
ശബരിമല നിലയ്ക്കൽ കണ്ട്രോൾ റൂം ഡ്യൂട്ടിയുടെ ഇടവേളയിൽ സഹപ്രവർത്തകൻ ജിബിൻെറ “മുൻപേ വാ.. എൻ അൻപേ വാ..” ?#keralapolice pic.twitter.com/p8kAwQHoWF
— Kerala Police (@TheKeralaPolice) December 7, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..